అదిలాబాద్

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జూన్ 23: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం స్థానిక సెయింట్ జోసెఫ్ కానె్వంట్ స్కూల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులతో పాటు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలపై ఇండియన్ యూత్ సెక్యూరడ్ ఆర్గనైజేషన్ పౌండర్ అధ్యక్షులు ఘన్‌శ్యాం ఓజా అధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ పిల్లలు ఇంటినుండి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా హెల్మెట్ అందించాలని, ఇలా ప్రతిసారి అందించినట్లయితే వారికి స్పూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఇటువంటి ప్రయత్నం చిన్నపిల్లలతోనే ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. జనమైత్రి కార్యక్రమాల్లో హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసు అధికారులు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. వాహనాలను నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని, ముఖ్యంగా అతివేగంతో ప్రయాణం ప్రమాదానికి మూలం అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని సూచించారు. రోడ్డు భధ్రతకు ఎప్పటికప్పుడు ఆర్టీసి, ఆర్‌టివో అధికారులతో చర్చించి తగు రక్షణ చర్యలు తీసుకుంటునామని, దీనిలో భాగంగానే నేషనల్ హైవే సమీపంలో ఉండే దాబా హోటల్‌లలో పూర్తిగా మద్యాన్ని నిషేదించడం జరిగిందన్నారు. పోలీసులు అధికారులు ముమ్మరంగా వాహనాల తనిఖీలను నిర్వహించి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఇంచార్జి ఆర్‌టివో పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రయోగాత్మకంగా నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజలందరూ సహాకరించాలని కోరారు. అందరి బాధ్యతతోనే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్క ద్విచక్రవాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ డిఎస్పీ లక్ష్మినారాయణ, యంవి ఐజి.వివేకానంద రెడ్డి, సిఐలు యండి షేర్ అలి, ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి ఎస్పీ
బడి బయట ఉండే పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం స్థానిక కోలిపూరలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్పీ పేద పిల్లలకు పలకలు, పెన్నులు, బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా పిల్లలతో కాసేపు మాట్లాడి వారి పేర్లు, తరగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ పోలీసు అధికారులు ప్రతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నారని అన్నారు. జిల్లా పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని, జనమైత్రి కార్యక్రమంలో బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. చదువుతోనే ఉన్నత సంస్కృతి వస్తుందని, అందుకై తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను క్రమంతప్పకుండా బడికి పంపించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ ఎ.లక్ష్మినారాయణ, పట్టణ సిఎన్.సత్యనారాయణ, ఏఎస్సై జి.అప్పారావు పాల్గొన్నారు.