వరంగల్

భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి: మహాభారతంలో శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం బోధించిన భగవద్గీత సారాంశం ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని ఆర్కేన్ శ్రీకృష్ణదేవాలయం అర్చకులు వేణుగోపాలకృష్ణమూర్తి కోరారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సారాంశం బోధించేందుకు మండలంలోని తిరుమలాయపల్లి గ్రామంలోని మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కత్తి లక్ష్మీచార్యులు ఆయన భార్య అయిన నాగలక్ష్మీ స్మారకార్థంతో గ్రామంలో యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా ఆర్కేన్ శ్రీకృష్ణదేవాలయం అర్చకులు వేణుగోపాలకృష్ణమూర్తి హాజరై యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగ శాలలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు అవతరించి భగవద్గీతను బోధించాడన్నారు. భగవద్గీత సారంశంను తెలుసుకున్నట్లయితే జీవి యొక్క పుట్టుక, మరణంలోని అంతరాత్మను అందులో పొందుపరిచిందన్నారు. ప్రతి ఒక్కరు సేవా ధృక్పథంతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరికి జననం, మరణం తప్పనిసరిగా ఉంటుందని, దానిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. మనం పరులకు సహాయం చేసినప్పుడే మన జన్మ సార్థ్ధకమవుతుందన్నారు. ఈ యాగ శాలలో గ్రామసర్పంచ్ వశపాక కుమారస్వామి, గ్రామస్థులు శంకరయ్య, మారయ్య, రమేష్, అర్జున్, రవి, అనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్బరుద్దీన్ ఓవైసిని అరెస్ట్ చేయాలి
* కాంగ్రెస్ డిమాండ్

నరుూంనగర్/వడ్డేపల్లి, ఫిబ్రవరి 2: హైద్రాబాద్ మహనగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు కారకులైన ఎం ఐ ఎం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసిని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైద్రాబాద్ పాతబస్తిలో కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తు హన్మకొండ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హైద్రాబాద్ ఎన్నికల్లో దుర్మార్గాలతో గెలవాలనే సంకుచిత భావాలతో అధికార పార్టీ, దాని మిత్ర పక్షమైన ఎం ఐ ఎం అరచకాలు సృష్టించడం దారుణమని అన్నారు. పాతబస్తిలో కాంగ్రెస్ కార్పొరేట్ అభ్యర్దిని అరెస్టు చేసి పోలీసులు మజ్లీస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి పాతనగరానికి వెళ్లిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి సభాపక్షనేత షబ్బీర్ అలీలపై మజ్లీస్ ఎంపి అక్బరుద్దీన్ ఓవైసి తన గుండాలతో వచ్చి దాడిచేయడం ఎమిటని ప్రశ్నించారు. ఈ సంఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా..? లేక అటవిక రాజ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుందని విచారం వ్యక్తం చేశారు. కెసిఆర్ అండతో సికింద్రాబాద్‌లో టిఆర్‌ఎస్ గుండాలు, హైద్రాబాద్‌లో మజ్లిస్ మూకలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి రిగ్గింగ్‌లతో అందలం ఎక్కాలనే కుట్రలు చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నాయకులకే విలువ ఉంటుంది కాని, రిగ్గింగ్‌లతో, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులను చేసి గెలిచే నాయకులకు విలువ ఉండదని వివరించారు. అధికార పార్టీ పోలీసులనే పార్టీ ఎజేంట్లుగా వాడుకుంటూ, అధికారులను సైతం వారి కనుసన్నల్లో పనిచేసేలా ఏర్పాట్లు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇంత దిగజారుడు రాజకీయాలు దేశంలో ఎప్పుడు జరుగలేదని అన్నారు. ఇంత జరుగుతున్న కూడ తెరాస అధినేత నోరు మెదపకపోవడంపై ఆంతర్యం ఎమిటని ప్రశ్నించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులకే రక్షణలేకుండా పోయిందని, ఇక సామన్యపౌరుల గతేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, శేఖర్, అశోక్, వేణు, శ్రీను, రవిందర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం గోల్‌మాల్ లెక్కలు తేల్చిన అధికారులు
*రూ.2.02కోట్ల అవినీతి జరిగినట్లు నిర్థారణ
*మిల్లు నిర్వాహకులపై కేసులు నమోదు
జనగామ టౌన్, ఫిబ్రవరి 2: జనగామ మండలం పసరమడ్ల శివారులోని కనకమహాలక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో జరిగిన ధాన్యం గోల్‌మాల్‌లో సుమారు రూ.2,01,96,000ల వరకు అవినీతి జరిగిందని డిఎస్‌వో సంధ్యారాణి వెల్లడించారు. గత మూడు రోజులుగా రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించి మంగళవారం వివరాలను తెలియచేశారు. ఆది, సోమవారాల్లో రెండురోజుల పాటు రైస్‌మిల్లులో గల ధాన్యం, బియ్యం, ఖాళీ బస్తాలను వేరుచేశారు. మొదటి రోజు అధికారులు అంచనా వేసిన నష్టం కన్న సుమారు 50లక్షల వరకు అధికంగానే అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా డిఎస్‌వో సంధ్యారాణి, సివిల్ సప్లై డిఎం విజయ్‌కుమార్‌లు మంగళవారం రాత్రి విలేఖరులతో మాట్లాడుతూ మిల్లులో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేశారు. 21 నవంబర్ 2015న కనకమహాలక్ష్మీ రైస్‌మిల్లు యజమానులకు 27,244క్వింటాళ్ల ధాన్యం కస్టం మిల్లింగ్ రైస్(సిఎంఆర్) కోసం ఇచ్చామని తెలిపారు. అందుకు 18,254క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 20 ఎసికెలు మాత్రమే ఇచ్చాడని వివరించారు. ప్రస్తుతం రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించగా 13,565క్వింటాళ్ల 92కిలోల ధాన్యం చోరీ చేసినట్లు వెల్లడైందని తెలిపారు. అవి సుమారు 33.67 ఎసికెలు ఉంటాయని తెలిపారు. ఆ ధాన్యం విలువ సుమారు రూ.2.02కోట్లు ఉంటుందని తెలిపారు. అందుకుగాను రైస్‌మిల్లు నిర్వాహకులు మహంకాళి శ్రీనివాస్, కానుగంటి శేఖర్‌లపై రెవెన్యూ రికవరీ చట్టంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారు అందుబాటులో లేనందున పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వివరించారు. మూడు రోజుల పాటు చేసిన తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ చెన్నయ్య, ఎఎస్‌వో రోజారాణి, ఎఫ్‌ఐ బాశెట్టి హరిప్రసాద్‌తో పాటు మరికొంత మంది సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

ప్రారంభమైన జాతీయ స్థాయి పోటీలు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 2: వరంగల్ జిల్లాలో మంగళవారం సాయంత్రం జాతీయ స్థాయి రెజ్లింగ్, బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంలోని హన్మకొండ జెఎన్‌ఎస్ గ్రౌండ్‌లో ఈ క్రీడాపోటీలు జరుగుతున్నాయి. 19 రాష్ట్రాల నుండి 527 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడాపోటీలను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల నిర్వాహణతో వరంగల్ నగరం కొత్తశోభను సంతరించుకుందని అన్నారు. రాజీవ్‌గాంధీ ఖేల్‌అభియాన్ జాతీయ స్థాయి గ్రామీణ అండర్ -16 బాల, బాలికల రెజ్లింగ్, బాస్కెట్‌బాల్ పోటీలు ఇక్కడ జరగడంతో క్రీడాస్ఫూర్తిని మరింత పెంచుతుందన్నారు. జాతీయస్థాయి క్రీడాపోటీలకు వరంగల్ ఆతిధ్యం ఇవ్వడం గర్వంగా ఉందని కలెక్టర్ అన్నారు. క్రీడాస్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొని దేశానికి పేరు తీసుకరావాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు చారిత్రాత్మక నగరమైన వరంగల్ పట్టణం స్వాగతం పలుకుతుందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలన్నారు. పోటీల నిర్వాహణ కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాపోటీల ప్రారంభానికి ముందు కలెక్టర్ వాకాటి కరుణ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన క్రీడాకారుల మార్చ్ఫాస్ట్‌లో పాల్గొని వారి నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. బాస్కెట్‌బాల్ బాలురలో పంజాబ్ హిమాచల్‌ప్రదేశ్‌పై, హర్యానా మణిపూర్‌పై గెలుపొందగా, బాలికల్లో కర్ణాటక త్రిపురపై, పంజాబ్ మణిపూర్‌పై విజయం సాధించాయి. ఈ పోటీలు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతున్నాయి.

-
ళనఆ
యానిమేషన్ టీంకు ఎస్పీ అభినంథన
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 2: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరను హైలెట్ చేస్తూ వరంగల్ పోలీసు అధికారులు ఏరీనా యానిమేషన్ వారు సంయుక్తంగా రూపొందించిన 3డి యానిమేషన్ డాక్యుమెంటరీ భక్తులకు జాతరకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందజేస్తుందని ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాను కలిసిన ఏరినా 3డి యానిమేషన్ హన్మకొండ ప్రతినిధులు గంట సమ్మిరెడ్డి, ఎం.బుచ్చిరెడ్డి, మురళిమనోహర్‌రావు, యానిమేషన్ విద్యార్థులు ఫణింద్ర, కీర్తి, వ్యాఖ్యత పల్లే నాగేశ్వర్‌రావులను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా మాట్లాడుతూ మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల కోసం తొలిసారిగా వన్‌వే విధానం ప్రైవేటు వాహనదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, వన్‌వేతో సులభంగా, సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, రద్దీ నియంత్రకు, వన్‌వే విధానం చాలా ముఖ్యమని అన్నారు. పోలీసులు ఏరినా యానిమేషన్ రూపొందించిన డాక్యుమెంటరితో ప్రజల్లో వన్‌వేపై నెలకొన్న అపోహలు తొలుగుతాయని అన్నారు.
వన్‌వే వల్ల కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే వాహనదారులు అదనంగా ప్రయాణిస్తారని ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. ఇప్పటికే మేడారం 3డి యానిమేషన్ డాక్యుమెంటరీని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం యానిమేషన్ డాక్యుమెంటరీని లోకల్ న్యూస్ ఛానళ్లలో, ఆర్‌టిసి బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో ప్రదర్శించబడుతుందని ఆయన తెలిపారు. మేడారంకు తరలివెళ్లే భక్తులు యుట్యూబ్‌లో ఉన్న వరంగల్ రూరల్ పోలీసు యానిమేషన్ అనే వీడియోను డౌన్‌లోడ్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరబాబు, ఇన్‌స్పెక్టర్లు రఘుచందర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వర్ధన్నపేట, ఫిబ్రవరి 2: వైద్యులను రోగులు దేవుడితో పోలుస్తారని కాబట్టి వారి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఒకవేల ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతందని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖి చేశారు. వైద్యసిబ్బందిని హజరు పట్టిక, ఇన్‌పెషేంట్, అవుట్ పెషేంట్ల అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. బయోమెట్రిక్ యంత్రం ఎందుకు వాడటం లేదని సూపరిండెంట్ రమేష్ రెడ్డి అడుగగా యంత్రం పని చేయడం లేదని తెలుపడంతో వెంటనే రిపేరు చేయించి బయోమెట్రిక్ యంత్రాన్ని మాత్రమే వాడాలని ఆమె సూచించారు. ఆసుపత్రిలో గర్భిని, ప్రసూతి స్ర్తిలకు అందిస్తున్న సేవలను అభినందించారు. కొన్ని వార్డులో రోగులకు కల్పిస్తున్న వసతుల పట్ల అసహనం వ్యక్తం చేశారు మంచాలపై దుప్పట్లు లేక పొవడంతో వెంటనే ఎర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఆసుపత్రి చుట్టు పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని మందలించారు. సమయ పాలన పాటించేందుకు వైద్యులు బయోమెట్రిక్ యంత్రాన్ని తప్పని సరిగా వినియోగించాలన్నారు. మండల కేంద్రంతో పాటుగా చుట్టు ప్రక్కల గ్రామాలనుంచి వస్తున్న పేదలకు వైద్య సేవలను అందించేందుకు వైద్యులు ఎప్పుడు అందు బాటులో ఉండాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రసవాలు 15 కంటే ఎక్కువ మొత్తంలో పెంచేందుకు వైద్యులు కృషి చేయాలని ఆమె కోరారు. విధులకు రాకుండా కొంత సిబ్బంది హజరు పట్టికలో సంతకాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఇప్పటికైనా వారి ప్రవృత్తిని మార్చుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆమె ఘాటుగా హెచ్చరించింది. ఆసుపత్రి అభివృద్ది నిధులనుంచి వెంటనే వాచ్‌మెన్, దోభీలను నియమించాలని ఆమె సూచించారు. ఆసుపత్రి తనిఖిలో స్థానిక సర్పంచ్ గాడిపెల్లి స్వరూప, ఆసుపత్రి సూపరిండెంట్ రమేష్‌రెడ్డి, వైద్యులు విజమలక్ష్మీ, సిబ్బంది పల్గొన్నారు.

రెడ్డీలకు రిజర్వేషన్ కావాలి

సెల్‌టవర్ ఎక్కిన యువకుడు *అరగంట పాటు హల్‌చల్, ట్రాఫిక్ జాం
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 2: రెడ్డి కులస్థులకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఓ యువకుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ముందు ఉన్న హోల్డింగ్‌ను ఎక్కి హల్‌చల్ చేశాడు. కరీంనగర్ జిల్లా అంబాల గ్రామానికి చెందిన భగవాన్‌రెడ్డి అనే యువకుడు గత కొంతకాలంగా వరంగల్‌లోనే జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌ను నడిపిస్తున్నాడు. మంగళవారం రాత్రి భగవాన్‌రెడ్డి కమిషనరేట్ కార్యాలయం ముందు ఉన్న హోల్డింగ్‌ను ఎక్కి రిజర్వేషన్ కావాలంటూ, జై తెలంగాణ నినాదాలు చేస్తుండడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధాన సెంటర్ కావడంతో పూర్తిగా ట్రాఫిక్‌జాం అయింది. ఈ లోపే హన్మకొండ ఏసిపి శోభన్‌కుమార్ సంఘటన స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు. ఇద్దరు యువకులను హోల్డింగ్ పైకి ఎక్కించి భగవాన్‌రెడ్డిని బలవంతంగా కిందకు తీసుకొచ్చారు. వెంటనే అతడిని హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భగవాన్‌రెడ్డితో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తానని ఏసిపి శోభన్‌కుమార్ తెలిపారు.

చిన్నమేడారంనకు ఏర్పాట్లు చేయాలి
*ఆర్‌డిఓలను ఆదేశించిన కలెక్టర్ కరుణ
బాలసముద్రం, ఫిబ్రవరి 2: జిల్లాలోని వివిధ ప్రాంతాలలో జరుగనున్న చిన్నమేడారం జాతరకు భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఆర్‌డిఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చిన్న మేడారం జాతరపై ఆర్‌డి ఓలతో జిల్లా వ్యాప్తంగా చిన్నమేడారం జాతరలకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా అవసరం మేరకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని, జాతర సందర్భంగా చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ శోభ, వరంగల్, జనగామ, నర్సంపేట ఆర్‌డిఓలు మాధవరావు, వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి 2: వ్యక్తిగత కారణాలతో జీవితంపై విరక్తి కలిగిన జొన్నల సోమేశ్(24) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానిక బస్టాండ్ ముందు ఉన్న దుకాణంలో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానికుల కధనం ప్రకారం ఈవిధంగా ఉన్నాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కిరాణ దుకాణం నడిపిస్తున్న జొన్నల వెంకటయ్య కుమారుడైన సోమేశ్ గత కొన్ని సంవత్సరాలు అదే దుకాణంలో తండ్రికి తోడుగా ఉంటూ వ్యాపారం సాగిస్తున్నాడు. తనకు 24 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పెళ్ళి సంబంధాలు తీసుకురావడం లేదని మారాం వేసిన సోమేశ్ ఒక్కసారిగా దుకాణంలో ఎవరు లేని సమయాన్ని గమనించి ఉరి వేసుకున్నట్లు స్థానికుల సమాచారం. కాగా కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ఉరి వేసుకున్న సోమేశ్ మృత దేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
సంతరించుకుంటున్న జాతర శోభ
*వనదేవతలకు ముందస్తు మొక్కులు
ఏటూరునాగారం, ఫిబ్రవరి 2: తాడ్వాయి మండలం మేడారం మంగళవారం జాతర శోభను సంతరించుకుంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు తల్లులుగా ప్రసిద్ది చెందిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మలను దర్శించేందుకు భక్తులు మందస్తుగా తరలిరావడంతో మేడారం జాతరశోభను సంతరించుకుంది.
వాహనాలలో భక్తులు మేడారం చేరుకుని ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించి నిలువెత్తు బంగారాలతో అమ్మవార్లను తనివితీరా దర్శించి కోరిన కోర్కెలు తీర్చినందుకు మొక్కులు చెల్లించుకుని సల్లంగ దీవించమని వేడుకుంటున్నారు. ఎక్కడ చూసినా మేడారం పరిసర అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా భక్తులు సేదతీరుతూ విందుభోజనాలుచేస్తూ కనిపించారు. ఏది ఏమైనప్పటికి పదిహేను రోజుల సమయం ఉన్నప్పటికి ముందుగానే భక్తులు తరలివస్తుండడంతో మేడారం జాతరశోభను సంతరించుకుంది.