అదిలాబాద్

గిరిజనుల భూములను లాక్కోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, జూన్ 24: గిరిజనుల భూములను లాక్కోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఈ ప్రయత్నాన్ని గిరిజనులు తిప్పికొట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన తూర్పుజిల్లా స్థాయి గిరిజన సమావేశంలో ఆయన మాట్లాడారు. హరిత హరం పేరుతో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నదని, అధికారులు గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటనున్నారన్నారు. ఈ విశయాన్ని వ్యతిరేఖిస్తున్న గిరిజనులు ఈ నెల 27న ఊట్నూర్‌లోని ఐటిడిఏ పి ఓ కార్యాలయం ముందు నిర్వహించనున్న ధర్నాను విజయవంతంచేయాలని ఆయన కోరారు. అందుకోసం సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని ఆదివాసీలు ఈ ధర్నాలో పాల్గోనాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన భూమి హక్కు పత్రాలను ఇప్పటి వరకు ఇవ్వలేదని, గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలను ఇవ్వకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నదన్నారు. పేద గిరిజనులకు 3 ఎకరాల చొప్పున ప్రభుత్వం ఇవ్వనున్నట్లు ప్రకటించినా, నేటికి భూములను ఇవ్వలేదన్నారు. భూమి హక్కు పత్రాల కోసం తెలంగాణలో 13 లక్షల మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని, వారిలో లక్ష మందికి మాత్రమే భూమి హక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఏలాంటి ప్రేమలేదని, వారిని అణగదొక్కడానికి అడుగడుగునా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని, పట్టా భూములను ఇవ్వాలని, పేద గిరిజనులకు 3 ఎకరాల చొప్పున భూములను ఇవ్వాలని, రుణాలను మంజూరుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.