అదిలాబాద్

26న ప్రభుత్వ ఇఫ్తార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జూన్ 24: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 26న జిల్లాలోని ముస్లీం సోదరులకు ప్రభుత్వ అధ్వర్యంలో ఇఫ్తారు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని డి ఆర్‌వో సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన ముస్లీం ప్రతినిధులతో ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సంధర్భంగా డి ఆర్‌వో సంజీవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పది నియోజకవర్ల స్థాయిలో ఆయా శాసన సభ్యుల అధ్వర్యంలో జూన్ 6న ఇఫ్తార్‌విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున మంజూరి చేయడం జరిగిందని, దీనిలో భాగంగా పేద ముస్లీం కుటుంబ సభ్యులకు ఉచితంగా నూతన వస్త్రాలు, సరకులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శాంతియుతంగా సామరస్యంగా విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్, భైంసా పట్టణాల్లో అధిక సంఖ్యలో పేద ముస్లీం కుటుంబాలు ఉన్నందునా పెద్ద ఎత్తున బట్టల పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ముస్లీం మత పెద్దలు సహాకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కేశవరావ్, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్ రెడ్డి, ఎంపిడీవో రవీందర్‌నాయక్, రవిబాబు, నిర్మల్ ఎంపిడీవో గజ్జారామ్, మున్సిపల్ కమిషనర్ త్రయంబకేశ్వర్, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.