అదిలాబాద్

మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్,జూన్ 26: మాదక ద్రవ్యాల వల్ల మానసికంగా భానిసత్వానికి గురవుతున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత అన్నారు. ఆదివారం పట్టణంలోని రణదీవ నగర్ కాలనీలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండ్ అనిత మాట్లాడుతూ గుడుంబాను పూర్తిగా నిషేదించాలని అన్నారు. ఎక్కడైనా గుడుంబాను విక్రయించినట్లయితే చ ట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఇప్పటికే ఆరు నెలల్లో విస్తృతంగా తనిఖీలు చేసి గుడుంబా స్థావరాలపై దాడులు చేసి మూసివేయించడం జరిగిందన్నారు. ఈ సదస్సులో స్ట్ఫె సిఈవో వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కవిత, సామాజిక కార్యకర్త బండారి దేవన్న పాల్గొన్నారు.