అదిలాబాద్

రిటైర్డ్ పోలీసు అధికారులు సామాజిక సేవల్లో ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, జూన్ 30: పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం స్థానిక పోలీసు ఫరేడ్ మైదానంలోని పోలీసు సమావేశ మందిరంలో పదవి విరమణ పొందిన పోలీసులకు ఎస్పీ శాలువా, పూలమాలలువేసి మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ సమాజంలో పోలీసు ఉద్యోగులు ప్రతి రోజు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉంటూ స్వచ్చందంగా సేవలందించాలని అన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన అలవెన్స్‌లను సత్వరమే అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. కాగా, పదవీ విరమణ పొందిన వారిలో సిసిఎస్ ఎస్సై యండి ఖాజా, దేవాపూర్ ఏఎస్సై పి.మల్లేశం, బెల్లంపల్లి ఏఆర్ హెడ్‌క్వాటర్స్‌కు చెందిన ఎఆర్ ఎస్సైలు పి.శంకర్, సి.సత్తయ్య, టి.సత్యనారాయణ గౌడ్, ఎస్‌ఎ సత్తార్, ఆహ్మద్ అలీలు ఉన్నారు.