అదిలాబాద్

దీపాయిగూడలో జోగు ఆశన్న అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 30: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్నకు బుధవారం పితృవియోగం చెందగా గురువారం ఆయన స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయిగూడలో ఆశేష జనవాహిని మధ్య జోగు ఆశన్న(95) అంత్యక్రియలు నిర్వహించారు. అర్ధరాత్రి నుండి కురుస్తున్న కుండపోత వర్షంతో వాగులు పోటెత్తి ప్రవహించడంతో అంత్యక్రియలకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వర్షంలోనే తడుస్తూ మహారాష్ట్ర మీదుగా పాటన్‌బోరి నుండి దీపాయిగూడకు చేరుకొని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు జోగు ఆశన్న పెద్ద తనయుడు పోతారెడ్డి చితికి నిప్పంటించగా ఆశన్న భార్య బోజుబాయి బోరున విలపించారు. రెండవ తనయుడైన మంత్రి జోగురామన్నను పలువురు నాయకులు ఓదార్చారు. అంత్యక్రియల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావ్ రామన్నకు ఫోన్‌చేసి జోగు ఆశన్న ఎలా మృతి చెందారని, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విఫ్ నల్లాల ఓదేలు, జడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి, జిల్లాకు చెందిన శాసన సభ్యులు కోనేరు కోనప్ప, రాథోడ్ బాపురావు, రేఖానాయక్, కోవలక్ష్మి, విఠ్ఠల్ రెడ్డి, దివాకర్ రావ్, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, పురాణం సతీష్‌లు దీపాయిగూడకు చేరుకొని మంత్రి రామన్నను పరామర్శించారు. ఈ సంధర్భంగా ఆశన్నకు నివాళులర్పించి, సంతాపం ప్రకటించారు. తెలంగాణ బిసి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, టిపిసిసి సభ్యుడు విఠ్ఠల్ కూడా మంత్రిని పరామర్శించిన వారిలో ఉన్నారు.