అదిలాబాద్

భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూలై 15: బాసర ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామని ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆదేశానుసారం అమ్మవారి ఉచిత అన్నదాన సత్రంలో గతంలో ఉన్న 200 భక్తుల పరిమితి సంఖ్యను 300 లకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రంలో అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తులతోపాటు సహపంక్తి భోజనాలు చేశారు.
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులతో ఆలయ ఉన్నతాధికారి దురుసుగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆలయ ఈవొపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భక్తుల సౌకర్యాలు, ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆలయ ఈవొకు ఎమ్మెల్యే సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గురుపౌర్ణమి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవొకు సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటి వైస్ ఛైర్మెన్ అఫ్రోజ్‌ఖాన్, తెరాసా నాయకులు రామారావు, మైసేకర్ సాయిలు, పోతన్న, దేవేంధర్, సుకేష్, రాజన్న పాల్గొన్నారు.