అదిలాబాద్

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జూలై 24: పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని ఎంపి గెడం నగేష్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో రెండవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ మున్సి పల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపి గెడం నగేష్ మాట్లాడుతూ అటవీ సంపదపై అక్ర మార్కులు కనే్నయడంతో అడవులు అంతరించిపోయాయని, దీంతో అనేక అనర్థాలు చోటుచేసుకుంటన్నాయని, సకాలంలో వర్షం కురవక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. మానవుని మనుగడకు చెట్లు ఎంతో అవసరమని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలని, మొక్క ఎదిగి చెట్టుగా మారినప్పుడే హరిత తెలంగాణ సాధ్యపడుతుందన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ రంగినేని మనీషా మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత లోపించి ప్రజలు అంటువ్యాధులు, విష జ్వరా లు వంటి తదితర రోగాలభారిన పడుతున్నారని, మనిషికి ప్రాణవాయువునిచ్చే చెట్లను పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న మొక్కలను ప్రతి ఇంటిలో నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, జె.లలిత, బాలూరి గోవర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, రైల్వే ఈఈ చక్రపాణి, టీఆర్‌ఎస్ నాయకులు రంగినేని శ్రీనివాస్, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.