అదిలాబాద్

ఉగ్రరూపం దాల్చిన ఎర్రవాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దహెగాం, జూలై 25: మండలంలోని ఎర్రవాగు సోమవారం ఉగ్రరూపం దాల్చడంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు, పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో ఎర్రవాగులో భారీగా నీటిమట్టం పెరిగి ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. గిరివెల్లి, ఖర్జి, పెట్టెం, గిరికపల్లి, మోహ, శంకరపురం, రాంపూర్, మొట్లగూడ, కుకుడ, రావులపల్లి గ్రామాలు ఎర్రవాగు ఉప్పొంగడంతో బాహ్య ప్రపంచానికి దూరమయ్యాయి. గ్రామాలకు రాకపోకలతోపాటు రవాణా సౌకర్యం స్తంబించిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి గెర్రె సమీపంలోని ఎర్రవాగుపై త్వరిగతిన వంతెన నిర్మాణం పూర్తి చేస్తేనే తమ కష్టాలు దూరమవుతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.