అదిలాబాద్

ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 29: ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం పిఎమ్మార్సీ భవనంలో ఏజెన్సీ ప్రాంత ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు, గ్రామీణ నీటిపారుదల శాఖ, పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు స్థానికంగా ఉంటూ దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా అంటువ్యాధుల తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తూ ఆనారోగ్యం భారిన నుండి ప్రజలను రక్షించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు కలుషిత నీరు త్రాగకుండా వాటి వల్ల వచ్చే రోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలని అన్నారు. నార్నూర్ మండలం మేడిగూడలో విషపూరిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం దారుణమని అన్నారు. ఎప్పటికప్పుడు నీటిని వేడిచేసి వడబోసుకొని తాగేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు తమ పరిధిలోని గ్రామాల పరిస్థితిని తెలుసుకొని ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించాలని అన్నారు. ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ అంటు వ్యాధులు అరికట్టడానికి అన్నిరకాల సౌకర్యాలు కల్పించామని, మందుల నిల్వలు సైతం అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాకార్యకర్తలు సమన్వయంతో ఎప్పటికప్పుడు సమాచారం స్వీకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభావిత ప్రాంతాలపై దృష్టిసారించాలని, ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే స్పందించి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.