అదిలాబాద్

ఊపందుకొన్న ఖరీఫ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేమనపల్లి, జూలై 29: వరుసగా కురుస్తన్న వర్షాలతో మండలంలో ఖరీఫ్ పనులు ఊపందుకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి వర్షాలు ఆశించిన స్థాయిలో కురియడంతో వరి సాగు చేసే రైతులు మొలక నారు మళ్ళను సిధ్దం చేస్తున్నారు. కేవలం 25 రోజుల్లో మొలక నారు ఎదుగుతుంది. దీంతో త్వరగా వరినాట్లు వేసుకోవచ్చన ఉద్దేశ్యంతో చాల మంది రైతులు మొలకను తమ పొలాల్లో చల్లుతున్నారు. మండలంలోని వేమనపల్లి, సుంపుటం, లింగాల, నీల్వాయి, జిల్లెడ, ముల్కలపేట గ్రామాల్లో గత వారం రోజుల రోజుల నుండి నారుమళ్ళను సిద్ధం చేస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ సంవత్సరం చాల మంది రైతులు వరిపంట సాగుపై దృష్టి సారించారు.