అదిలాబాద్

ఏజెన్సీలో రాష్ట్ర మంత్రుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఆగస్టు 4: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు గురువారం ఏజెన్సీలో పర్యటించారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోవలక్ష్మిలతో పాటు ఆధికార యంత్రాంగంతో కలిసి ఉట్నూరు, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించి ఏజెన్సీలో గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ముందుగా మంత్రులు హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ అధ్వర్యంలో గంగాపూర్‌కు చేరుకొని మొక్కలు నాటారు. అనంతరం ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రసూతి గదిని ప్రారంభించారు. అదే విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు. అక్కడే నూతనంగా నిర్మిస్తున్న అదనపు వార్డు గదుల నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. గత కొద్ది రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్న రెండవ ఏ ఎన్ ఎంలు తమను క్రమబద్దీకరించాలని కోరుతూ మంత్రులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కొమరంభీం ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లక్ష్మారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఇప్పటి వరకు జ్వరాలు, అతిసారతో ఐదుగురు మాత్రమే మృతి చెందారని అన్నారు. గిరిజన గ్రామాల్లో విధులు నిర్వర్తించే ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు ఆడి కిట్ల్, మందులు అందించామని అన్నారు. వ్యాధులపై జూన్ నెల నుండే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కళాజాత బృందాలతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, శానిటేషన్, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు పది మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసిన తగిన చర్యలు తీసుకున్నామని అన్నారు. గిరిజనులు మూడనమ్మకాలను వదిలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేసుకోవాలన్నారు. వైద్యశాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 2018 వివిధ వైద్య ఖాళీలను త్వరలో భర్తీచేయనున్నామన్నారు. అనంతరం జైనూర్ మండలం ఉసేగావ్‌లో మొక్కలు నాటారు. గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ద పనులను పరిశీలించారు. జలపతి అనే వ్యక్తి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా బాలబడి కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుండి ఉసేగావ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం నుండి సిబ్బంది లేక తమకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని గిరిజనులు మంత్రి దృష్టికి తీసుకవెళ్లారు. జైనూర్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని రోగులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించేందుకు ఐటిడి ఏ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా ఆసుపత్రిలోని రోగులను పరామర్శించారు. సిర్పూర్‌యు మండలం శెట్టిఅడనూర్‌కు చేరుకొని 153 మంది గిరిజన కుటుంబాలకు దోమ తెరలు, 15 మంది గర్భిణీ స్ర్తిలకు పోషకాహారం కిట్లు అందించాలరు. ఈ సంధర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే గిరిజన గ్రామాల్లోని ప్రజల్లో మార్పులు వచ్చాయని అన్నారు. వైద్య అధికారుల సూచన మేరకు నడుచుకున్నట్లయితే రోగాలు దరికిచేరవని అన్నారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించి వైద్య ఆరోగ్య సేవలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ప్రభావతి, జిల్లా వైద్యాధికారి జలపతి నాయక్, జిల్లా మల్లేరియా అధికారి అల్హాం రవి, ఆర్డీవో ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.