అదిలాబాద్

బాసరలో భక్తజన సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు 7: సుప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తా రు. శ్రావణమాసం పర్వదినం కావడం తో బాసరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండే భక్తులు నదితీరంలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనసేవలకు క్యూలైన్‌లో బారు లుతీరారు. ఉదయం నుండి మధ్యా హ్నంవరకు భక్తులు పోటెత్తడంతో దర్శ న సేవలకు 2 గంటల సమయం పట్టిం ది. క్యూలైన్‌లో ఉన్న వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో క్యూలైన్‌లో వృద్దులు, చిన్నారులు తాగునీటి ఇబ్బందులకు తీవ్ర గురయ్యారు. ఆదివారం శ్రావణమాసం కలిసిరావడంతో అమ్మవారిచెంత తమ చిన్నారులకు అక్షరస్వీకారాలు నిర్వహించేందుకు ఒక్కరోజు ముందే బాసరకు భక్తులు తరలిరావడంతో ఆలయానికి చెందిన వసతి గృహాలు, ప్రైవేటు వసతి గదులు నిండిపోవడంతోభక్తులు రాత్రివేళలో ఆలయ ప్రాంగణంలోనే సేదతీరారు. శుభముహూర్తం గడియలు 11 గంటలకు ఉండడంతో ప్రత్యేక అక్షరస్వీకార పూజలకు భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. భక్తులను, చిన్నారులను అదుపుచేయడానికి పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్సై పల్లె నర్సింగ్, ట్రెయినీ ఎస్సై కృష్ణ, కానిస్టేబుల్‌లు, హోంగార్డు లు ప్రత్యేకంగా భద్రత చర్యలు చేపట్టారు. 1200మంది చిన్నారులకు సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాస మండపాల్లో ఆలయ అర్చకులు అక్షరాభ్యాస పూజలను నిర్వహించారు. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలతో ఆలయానికి ఒక్కరోజే 7లక్షల 50వేల ఆదా యం సమకూరింది. సుమారు 15 వేల మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పూజలు
అమ్మవారి సన్నిధిలో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుటుంబ సమేతం గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తన మనవరాలికి ప్రత్యే క అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులచే అక్షర స్వీకార పూజలను నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరివెంట ఆలయ సూపరిండెంట్ సాయి లు, సిబ్బంది పాల్గొన్నారు.