అదిలాబాద్

మూడు జిల్లాల ప్రతిపాదనపై భగ్గుమన్న ఆదిలాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 12: శాస్ర్తియ విధానాలు పాటించకుండా ఆదిలాబాద్ జిల్లాను మూడు జిల్లాలుగా ముఖ్యమంత్రి విభజించడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగ, కుల సంఘాలు ఏకతాటిపై వచ్చి నేటి నుండి అందోళనలు ఉద్ధృతం చేయాలని తీర్మానించాయి. శుక్రవారం సాయంత్రం టిఎన్జీవోస్ భవన్‌లో జరిగిన ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో పలు సంఘాల నేతలు, రాజకీయ పక్షాల ప్రతినిధులు నిర్మల్ జిల్లా ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకొని, ఆదిలాబాద్ జిల్లాలోనే కొనసాగే విధంగా చూడాలని ముక్తకంఠంతో తీర్మాణాన్ని ఆమోదించాయి. అంతేగాక కొత్తగా తెరపైకి వచ్చిన నిర్మల్ జిల్లా ఆ ప్రాంతానికి చెందిన మంత్రి రాజకీయ స్వలాభం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జిల్లాలో పునర్విభజనలో నిర్మల్ పేరును చేర్చారని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను విభజించి విసిరేసినట్లు వేరుచేస్తే సహించేది లేదని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేశాయి. కార్యక్రమంలో మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సి.రాంచంద్రారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, బిసి సంఘాల జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యం, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, న్యాయవాదుల సంఘం తరుపున నగేష్, మేకల మల్లేష్, గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఆశోక్, పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు దారుట్ల జీవన్, బిసి సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారుట్ల కిష్ఠు, టియుటిఎఫ్, టిఆర్‌టియు, టిఎస్‌టియు ఉపాధ్యాయ సంఘాల సభ్యులతో పాటు నిరుద్యోగ సంఘాల నేతలు మాట్లాడి ఉద్యమాలకు సిద్ధంగా ఉంటామని పిలుపునిచ్చాయి. రాజకీయ కుట్రతో నిర్మల్ జిల్లా చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే 5, 6 ఆర్టికల్ ప్రకారం గిరిజనులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఆదివాసీ జిల్లాగా ఉట్నూరును చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నందున రాజకీయ మనుగడ కోసమే అక్కడి నేతలు కొత్తగా జిల్లా పేరును తెరపైకి తెచ్చారని రాజకీయ పార్టీలు విమర్శించాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలోనే అన్నివర్గాలను కలుపుకొని నేటి నుండి ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని, గల్లి నుండి హైదరాబాద్ వరకు అందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే శనివారం ఆదిలాబాద్ పట్టణ బంద్, ఆ తర్వాత విద్యాసంస్థల బంద్, 15 నుండి నల్లబ్యాడ్జీలతో నిరసన దీక్షలు, ర్యాలీలు, బహిరంగ సభలు ముమ్మరంగా చేయాలని తీర్మానించారు.
ఉద్యమ కమిటీ కన్వీనర్‌గా ఈర్ల సత్యం ఎన్నిక
నిర్మల్ జిల్లా వద్దు ఆదిలాబాద్‌లో కలిసి ఉంటేనే ముద్దు అన్న నినాదంతో ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ ఉద్యమ కమిటీ సమావేశమై ఉద్యమ కమిటీని ఖరారు చేసింది. కమిటీ కన్వీనర్‌గా బిసి సంఘాల అధ్యక్షుడు ఈర్ల సత్యం, కో-కన్వీనర్‌గా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ పార్టీలు కూడా ఈ అందోళనకు మద్దతు ప్రకటించాయి.