అదిలాబాద్

ఆదిలాబాద్‌లో ఎగిరిన త్రివర్ణ పతాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 15: 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పట్టణంలో సోమవారం కన్నుల పండువ గా సాగాయి. ఉదయం నుండే విద్యార్థుల ప్రబాత్‌భేరి, పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణలు, మిఠాయిల పంపిణీ పండగ వాతావరణం లో జరిగింది. పట్టణంలోని మంత్రి జోగు రామన్న తెలంగాణ చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ రంగినేని మనీషా జాతీయ పతాకావిష్కరణ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తలకిందులుగా జెండా ఎగరవేసి జాతీయ గీతాలాపన గావించడంతో అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు, పట్టణ కౌన్సిలర్లు కంగుతిన్నారు. జాతీయ జెండాకు అవమానం జరిగిందని వాపోయారు. ఇదిలా ఉంటే, పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, టిడిపి కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి యూనిస్ అక్బాని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, రాంలీలా మైదానంలో డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్యాలయంలోజెసి సుందర్ అబ్నార్, జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి ఉదయగౌరి, డిసిసిబి కార్యాలయంలో చైర్మెన్ దామోదర్ రెడ్డి, రిమ్స్ కార్యాలయంలో డైరెక్టర్ ఆశోక్, సుధాకర్, బుద్దిమాంధ్యం సంరక్షణ పాఠశాలలో ఐసిడిఎస్ అధికారిణి మిల్కా, డిపి ఆర్‌వో కార్యాలయంలో ఏడి సత్యనారాయణ, జడ్పీ కార్యాలయంలో చైర్‌పర్సన్ శోభారాణి, ఆదిలాబాద్ మండల కార్యాలయంలో ఎంపిపి నైతం లక్ష్మి తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతి ప్రదానోత్సవం సంబరంగా జరిగాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ జెండాను ఎగరవేసి సంబరాల్లో పాలుపంచుకున్నారు.