అదిలాబాద్

మూడు జిల్లాల విభజనకే సిఎం ఆమోదముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 19: జిల్లాల విభజన చిచ్చు ఓ వైపు రాజుకుంటుండగా ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తగా 17 జిల్లాల ఖరారుకు తుది నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలుత తూర్పు, పశ్చిమ రెండు జిల్లాలు మాత్రమే ఉంటాయని అందరూ భావించగా ముచ్చటగా మూడో జిల్లా నిర్మల్ పేరు తెరపైకి రావడంతో ఆదిలాబాద్ డివిజన్‌లో వివాదం రాజుకుంది. ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ సమితి అధ్వర్యంలో నిర్మల్ జిల్లా ప్రకటించవద్దని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఉద్యమాలు సాగిస్తూ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మెన్, డిప్యూటి సిఎం మైమూద్ అలీకి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. నిర్మల్ జిల్లాను జాబితాలో కొత్తగా చేర్చడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో ఆదిలాబాద్, తాంసి, తలమడుగు, జైనథ్, బేల మినహా మిగితా మండలాలన్నీ ఏజెన్సీ పరిధిలోకి వచ్చి అనేక చిక్కుముడి సమస్యలు ఎదురవుతాయని ఉద్యమ నేతలు పేర్కొంటున్నారు. పైగా జిల్లా స్థాయి ఉద్యోగ నియామకాల పోస్టుల భర్తీలో ఎస్టీలు మినహా మిగితా వారికి తీరని అన్యాయం జరుగుతుందని, ఉద్యోగుల పదోన్నతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్‌ను అరగంట సేపు పరిరక్షణ కమిటీ నేతలు ఘెరావ్ చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. మూడు జిల్లాల విభజన వల్ల ఆదిలాబాద్ కొత్త జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని, నిర్మల్ జిల్లా ప్రకటించకుండా ముథోల్, భైంసా ప్రాంత వాసుల కోసం భైంసా రెవెన్యూ డివిజన్ కేటాయించాలే తప్పా నిర్మల్ జిల్లా వల్ల ప్రయోజనం లేదని వారు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకవస్తామని స్వామిగౌడ్ హామి ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన కొత్త జిల్లాల జాబితాలో మండలాల స్వరూపం కూడా మార్చివేసి మూడు జిల్లాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో తిర్యాణి, కాసిపేట మినహా మిగితా మండలాలన్నీ అభివృద్ది పథంలో ఉన్న మైదాన ప్రాంతాలే కావడం గమనార్హం. నిర్మల్ జిల్లాగా ఏర్పడితే ఆ జిల్లాలో ఒక్క ఏజెన్సీ మండలం కూడా ఉండే అవకాశం లేకుండా పోయింది. ఆదిలాబాద్ కొత్త జిల్లాలో కెరమెరితో కలుపుకొని 17 మండలాల జాబితాతో శనివారం ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. ఈ జిల్లాలో ఆదిలాబాద్, మావల, బజార్‌హత్నూర్, బేల, బోథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, జైనథ్, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూర్‌యు, ఉట్నూరు, నేరడిగొండ, కెరమెరి మండలాలను చేర్చారు. కొమరంభీం జిల్లాగా నామకరణం చేసే మంచిర్యాల జిల్లాలో 25 మండలాలను చేర్చడం ద్వారా రాష్ట్రంలో రెండో పెద్దజిల్లాగా అవతరించనుంది. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసిన తుది జాబితా ప్రకారం కొమరంభీం జిల్లాలో చెన్నూరు, జైపూర్, కోటపల్లి, లక్సెటిపేట్, మందమర్రి, మంచిర్యాల, దండేపల్లి, హజీపూర్, నస్పూర్, ఆసిఫాబాద్, బెజ్జూర్, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బెన, సిర్పూర్‌టి, పెంచుకల్‌పేట్, వాంకిడి, కాసిపేట్, బెల్లంపల్లి, వేమనపల్లి, తాండూర్, బీమిని, దహెగాం, నెనె్నల, తిర్యాణి మండలాలు చేర్చారు. నిర్మల్ జిల్లాలో కొత్త మండలాల స్వరూపాన్ని పరిశీలిస్తే 15 మండలాలతో జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. సోన్ మండలంతో కలిపి నిర్మల్, భైంసా, దిలవార్‌పూర్, కడెం, ఖానాపూర్, కుబీర్, కుంటాల, లక్ష్మాణచాంద, లోకేశ్వరం, మామడ, ముథోల్, నిర్మల్, సారంగపూర్, తానూర్, జన్నారం మండలాలతో తుది జాబితా ప్రకటించనున్నారు. అయితే రెవెన్యూ డివిజన్ల విషయానికి వస్తే కొత్తగా బెల్లంపల్లితో పాటు ఆరు మండలాలతో కలిపి భైంసా డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ముసాయిదా సిద్దమైంది. శనివారం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ముసాయిదా నోటిఫికేషన్ జారీ అనంతరం 15 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి, తుది కసరత్తు అనంతరం దసరా నాటికి కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది.