అదిలాబాద్

నిర్మల్ జిల్లా వద్దంటూ స్వామిగౌడ్ ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 19: నిర్మల్ జిల్లా ఖరారును నిలిపివేయాలని, ఈ జిల్లా ఏర్పాటు వల్ల ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ టి ఎన్జీవో భవనం వద్ద శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్‌ను ఘెరావ్ చేశారు. సుమారు గంటసేపు స్వామిగౌడ్‌తో పాటు మంత్రి జోగురామన్నను నిలదీసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను శాస్ర్తియంగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలుగానే విభజించాలని, కొత్తగా నిర్మల్ జిల్లా రావడం కేవలం రియల్ ఎస్టెట్‌వ్యాపారులకు, రాజకీయ నేతలకు మాత్రమే లాభసాటి అవుతుందని అన్నారు. తద్వారా ఆదిలాబాద్ ప్రాంతం ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురికావడమే గాక ఉద్యోగ పోస్టులు కూడా భర్తీకాలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నవిస్తానని మండలి చైర్మెన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి కన్వీనర్ ఈర్ల సత్యం, కో కన్వీనర్ జగదీష్ అగర్వాల్, సామల ప్రశాంత్, ప్రమోద్, వజే తదితరులు పాల్గొన్నారు.