అదిలాబాద్

రైతులకు అండగా నిలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 28: జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ పరిస్థితుల్లో జిల్లా రైతాంగానికి అండగా నిలిచి తెరాస ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం బిజెపి నూతన భవన కార్యాలయం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు నాగం జనార్థన్‌రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగం జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి కార్యాలయం నిర్మించుకుని ప్రారంభించుకోవడం శుభదినమని కష్టపడిన వారందరిని తాను అభినందిస్తున్నానని వెల్లడించారు. రైతుల పక్షాన ప్రతి బిజెపి కారన్యకర్త నిలవాల్సి ఉందని వెల్లడించారు. పత్తిపంటతో పాటు మొక్కజొన్న, కంది పూర్తిగా నాశనం అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి పెద్దగా చొరవ చూపడం లేదని వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెట్టివేయడానికి చూస్తుందని ఆరోపించారు. కృష్ణానదిలో 1000 టి ఎంసిల నీరు గత కొనే్నళ్ల నుండి రావడం లేదని వచ్చిన నీటిని వినియోగించుకోవడానికి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. 96శాతం ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని రూ.800కోట్లు కేటాయిస్తే అన్ని పనులు పూర్తి అయ్యి సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం ఆరోపించారు. రాజకీయ పార్టీలకు రాజకీయ మనుగడ ఉండాలంటే రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని అందులో బిజెపి నాయకులు కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసి సమన్వయంతో ముందుకు వెళ్దామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, ప్రధాన కార్యదర్శులు బాల్‌రాజ్, శ్రీవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు నాగర్‌కర్నూల్ రైల్వేలైన్ సాధన సమితి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌కు రైల్వేలైన్ కావాలంటూ వినతి పత్రం అందజేశారు.