అదిలాబాద్

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసిపేట, ఆగస్టు 21: తెలంగాణ ప్రభుత్వం గడిచిన రెండేళ్ళలో అభివృద్ది, సంక్షేమానికి ఎంతో పాటుపడుతుందని రాబోయో రోజులలోను నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేస్తానని అందుకు ప్రజల సహాకారం అవసరమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఆదివారం సోమగూడెం భారత్‌కాలనీలో ఎంపి నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ళలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టడం జరిగిందని తెలిపారు. గత సీమాంధ్ర పాలనలో గ్రామాలలో అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పటికి కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్డ సౌకర్యాలు లేవన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ అవుతూ ముందుకు దూసుకు వెలుతున్నామన్నారు. ఇంకా ఎంతో అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. ఎంపి నిధులు రూ.3 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. నియోజిక వర్గంలో దశల వారిగా అభివృద్ది చేపడుతామన్నారు. నియోజకవర్గంలోని మారుమూల వేమనపల్లి, నెనె్నల, బీమిని మండలాలకు పూర్తిస్థాయి రోడ్డు మార్గాలు లేవని పట్టణాలకు రావాలంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రోడ్లు రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని అన్నీ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రజలతో కలిసి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం బెల్లంపల్లి జడ్పీటిసి రాంచందర్ మాట్లాడుతూ భారత్‌కాలనీ సింగరేణి పరిధిలో ఉన్నప్పటికి పంచాయితీ నుండే అభివృద్ది పనులను చేపట్టామన్నారు. ఇంకుడు గుంతలు తవ్విన వారికి బిల్లు సరిగా రావటం వేదని, అదేవిధంగా ఇండ్లకు సంబందించిన బిల్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే చొరవ తీసుకుని బిల్లులను ఇప్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు దుర్గం గోపాల్ మాట్లాడుతూ భారత్‌కాలనీలో ఓటర్లు అధికంగా ఉన్నారని దీనిని ప్రత్యేక పంచాయతిగా ఎర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.