అదిలాబాద్

61 మంది ఎస్సైలకు స్థానచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 25: జిల్లాల పునర్విభజన నోటిషికేషన్ జారీ కావడంతోనే పోలీసు శాఖలో మూకుమ్మడి బదిలీల కసరత్తు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా ఒకేసారి 61మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ వరంగల్ రేంజ్ డిఐజి ఆర్.ప్రభాకర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 29మంది ఎస్సైలకు తొలి పోస్టింగ్ ఉత్తర్వులతో బదిలీలు చేయడం గమనార్హం. ఈ మేరకు 29మంది శిక్షణ పూర్తిచేసుకున్న ఎస్సైలకు పోలీసు స్టేషన్‌లను కేటాయించడం జరిగిందని ఎస్పీ దుగ్గల్ తెలిపారు. ఇదిలా ఉంటే, కొత్తగా పోస్టింగులపై వెళ్తున్న ప్రోబిషనరీ ఎస్సైల స్థానాల్లో పనిచేస్తున్న ఎస్సైలకు అటాచ్డ్‌గా ఉత్తర్వులు వెలువడ్డాయి. వారికి త్వరలోనే పోస్టింగులు జారీ చేయనున్నారు.
ఆదిలాబాద్ ట్రాఫిక్ ఎస్సైగా పనిచేస్తున్న వి.గోపాల్‌రావును మంచిర్యాలకు బదిలీ చేశారు. మంచిర్యాల ఎస్సై ఎం.వెంకటేశ్వర్లను పిసిఆర్ మందమర్రికి, అదేవిధంగా సిసిసి నస్పూర్‌లో అటాచ్డ్‌గా ఉన్న ఎస్సై పి.దత్తాద్రిని అదేస్థానంలో పోస్టింగు కల్పించగా స్థానికంగా ఉన్న వారిని స్పెషల్ బ్రాంచ్, సిసిఎస్, పోలీసు శిక్షణ కేంద్రం, ఇతర ఎస్‌హెచ్‌గా ఉన్న పట్టణ స్టేషన్‌లకు బదిలీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై సుబ్బారావు తలమడుగుకు, ఇంద్రవెల్లి ప్రోబిషనరీ ఎస్సై గంగారాం ఇంద్రవెల్లికి, నిర్మల్ రూరల్‌లో ప్రోబిషనరీలో ఉన్న శ్రీరాం ప్రేమ్‌దీప్‌ను సోన్‌కు, కుమారి రమేష్ కుబీర్‌కు, జి.బాలకృష్ణ కడెంకు, యూనిస్ అహ్మద్ కుంటాల, తోట మహేష్ బాసర, వినోద్‌కుమార్ కోటపల్లి, బి.సమ్మయ్య లక్సెటిపేట్, పి.సతీష్ కాసిపేట్, రాజ్‌కుమార్ మాదారం, తోట తిరుపతి ఆదిలాబాద్ రూరల్, సిహెచ్ తిరుపతి లింగాపూర్, నేరెండ్ల రమేష్ నెనె్నల, తహసీదోద్దిన్ హాజీపూర్, కె.శేఖర్ బీమిని, కె.శ్రీకాంత్ నార్నూర్, కె.రవి తాండూర్, డి.అశోక్ దహెగాం, జి.సుధాకర్ ఈజ్‌గావ్, కె.సంజీవ్ పెంబి, కె.శ్రీధర్ కెరమెరి, కొల్లూరి వినయ్ ఖానాపూర్, ఆకుల శ్రీనాథ్ బజార్‌హత్నూర్, ఎ మల్లేశం తాళ్లగురిజాల, కె.రాజేష్ కాగజ్‌నగర్ రూరల్, ఎల్.్భమేష్ దండేపల్లి, జె.రమేష్ లోకేశ్వరం, జి.మల్లేష్, ఎన్.శ్రీనివాస్, పి ప్రభాకర్, డి రమేష్, టి నర్సింగ్, జె.శ్యాంసుందర్, కె.రవిప్రసాద్, పి.రామారావు, ఎం.రవీందర్, ఎం.రమేష్, ఎస్ ప్రమోద్‌రావు, బి శ్రీధర్, బి రాములను ఆదిలాబాద్ ఎస్‌బికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో బదిలీ అయిన వారు తమ స్థానాల్లో చేరాలని ఆదేశించారు. నూతన ఎస్సైలు తమ పరిధిలో జనమైత్రి కార్యక్రమాలు కొనసాగించాలని, ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటూ నేరాలను నియంత్రించాలన్నారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలను ఎంచుకోవాలని, సామాజిక సేవల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.