అదిలాబాద్

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, ఆగస్టు 26: సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క మహిళ నడుం బిగించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. స్థానిక పట్టణంలో గోరుబంజార తీజ్ ముగింపు ఉత్సవాలు శుక్రవారం ఐబి చౌరస్తాలో బంజార సంఘాల అధ్వర్యంలో నిర్వహించగా పివోతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు బంజార మహిళలు, యువతులు గత వారంరోజులుగా గోధమ బుట్టలను పూజిస్తూ వస్తుండగా తలపై పెట్టుకొని నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంస్కృతిక సాంప్రదాయ నృత్యాలతో పాటు సంప్రదాయ దుస్తువులతో పండగ విశిష్టతను చాటిచెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ ప్రత్యేక రోజుల్లో సాంప్రదాయ దుస్తువులు ధరించాలని పిలుపునిచ్చారు. మిగితా రోజుల్లో ఉపయోగించే దుస్తువులకంటే పండగ వేళల్లో సంస్కృతి సాంప్రదాయాలు చాటిచెప్పే విధంగా దుస్తులు ధరించినట్లయితే దాని విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని అన్నారు. అదేవిధంగా సంస్కృతిక సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో వాటి విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలని అన్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి కెసి ఆర్‌కు విన్నవించి ప్రభుత్వ అధ్వర్యంలో పండగ ఉత్సవాలు జరిగేలా కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ, యువత సాంప్రదాయ దుస్తులు ధరించి పివో చెప్పినట్లు కనబడాలని, వచ్చే సంవత్సరం తాను సైతం సాంప్రదాయ దుస్తువుల్లోనే కనబడుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగజీవన్, ఎంపిపి విమల రాథోడ్, సర్పంచ్ బొంత అశారెడ్డి, బంజార సంఘం నాయకులు శ్రీరాం నాయక్, జాలమ్‌సింగ్, వెంకట్‌రావు, భరత్‌చౌహన్, జనార్ధన్, రామారావు, గంగారాం నాయక్, నారాయణ్ నాయక్, రమణజాదవ్, ప్రకాష్, కృష్ణాజాదవ్, తహసీల్దార్ రమేష్‌రాథోడ్, అనిల్ రాథోడ్, దిపక్‌సింగ్ షేకావత్, రాథోడ్ గణేష్, సెడ్మకి సీతారాం పాల్గొన్నారు.