అదిలాబాద్

కొత్త జిల్లాల రూపు రేఖలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఆగస్టు 26: దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల ముసాయదాకు సంబంధించిన రూపురేఖలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగా ఏర్పాటైన మూడు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, (కొమురం భీం) మంచిర్యాల జిల్లాల మండలాల వారీగా మ్యాప్‌లను రూపు రేఖలతో కూడిన పటాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి శుక్రవారం తెచ్చారు. కొమురం భీం (మంచిర్యాల) జిల్లాలో 26 మండలాలు, ఆదిలాబాద్ జిల్లాలో 16 మండలాలు, నిర్మల్ జిల్లాలో 13 మండలాలను విలీనం చేస్తూ ఈ మ్యాప్‌లను రూపొందించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు వేసినట్లయింది. అలాగే ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకై తలపెట్టిన కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు భవనాలను సైతం గుర్తించారు. వీటితోపాటు ఆయా శాఖలన్నింటికి తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటుచేయనున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా శాఖల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. ఈ అధికారుల ఆధ్వర్యంలోనే ఉద్యోగుల విభజన జరగబోతోంది. అయితే ఉద్యోగుల సర్దుబాటు వ్యవహారం కూడా అధికారుల కార్యదీక్షతకు పరీక్షగా మారనుంది. అయితే మిగులు ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశం కీలకం కానుంది. ముఖ్యంగా నిర్మల్‌లో జిల్లాలో కేవలం 13 మండలాలు మాత్రమే ఉండడంతో ఇక్కడ పరిపాలన సులభతరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 13 మండలాలు రెవెన్యూ డివిజన్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ 13 మండలాలు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఉండడంతో గత రెవెన్యూ పాలనకు సరిపోయేంతగా సౌలభ్యత ఏర్పడనుంది. కాగా, స్థానిక ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయంగా, రాంనగర్‌లోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా ఏర్పాటుచేయబోతున్నారు. అలాగే మిగతా జిల్లా కార్యాలయాన్నింటిని ప్రస్తుతం ఉన్న డివిజన్ కార్యాలయ భవనాల్లో కొనసాగించనున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం జిల్లా కార్యాలయాల్లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుకాని, పైస్థాయి అధికారులను గాని కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.