అదిలాబాద్

వారబందీతో పంటలసాగుపై దృష్టి కేంద్రీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్ రూరల్, ఆగస్టు 29 :సరస్వతీ కాలువద్వారా వారబంధీ పద్దతిలో విడుదలవుతున్న సాగనీటిని సద్వినియోగం చేసుకోని రైతులు పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాఫ్రాపూర్‌లో సోమవారం పశువులకు మంత్రి నట్టల నివారణ మందును వేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ రైతులు వారబంధీ కాకుండా పంటల సాగుకు ఈ దఫా రోజు వారిగా సాగు నీటిని విడుదల చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ సాగు నీటి లభ్యత, పంటల సాగుపై వ్యవసాయ శాస్త్ర వేత్తల అధ్యయనం అనంతరమే వారబంధి పద్దతిన నీటిని విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆందోళన చెందవద్దని పంట నష్టపోకుండా ఈ సాగునీరు సరిపడుతుందని రైతులకు వివరించారు.పశుపోషణ మేళుకువలను తెలుసుకోవాలని సూచించారు.పాడి పశువులతో పాటు గోర్రెలు,మేకలు ఇతర పశువుల సంరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏలాంటి సందేహాలున్నా అందుబాటులో గల పశువైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచి సాయిరెడ్డి, ఎంపిపి అలోల సమతి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, నాయకులు రాంకిషన్ రెడ్డి, ముత్యంరెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు శనిగరపునరేశ్, ఎడిఎ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.