అదిలాబాద్

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని (ఏఐకెఎస్)తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులందరికి రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాల వల్ల ఎందరో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదని, దీంతో రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవాల్సిన వస్తుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో రైతాంగానికి చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. 60 సంత్సరాలు నిండి ప్రతీ రైతు, రైతు మహిళకు నెలకు రూ.10వేల పింఛన్ ఇవ్వాలని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సూచన మేరకు పంటలకు అయ్యే ఖర్చుకు 50 వాతం కలిపి మద్దతు ధర నిర్ణయించి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని, రుణమాఫీ మూడు, నాల్గవ ధపాలను ఒకేసారి జమచేసి కొత్త రుణాలను ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు 2013 భూసేకరణ చట్టాని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల రక్షణకు వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 1న డిమాండ్స్‌డేగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముడుపు ప్రభాకర్ రెడ్డి, సక్కు బాయి, గడ్డం భూపతి రెడ్డి, అరుణ్‌కుమార్, కొండ రాజన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.