అదిలాబాద్

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 4: మొక్కలు నాటడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతీ కుటుంబం పచ్చదనాన్ని పెంచుకోవాలని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారి మైసమ్మ ఆలయ సమీపంలో గాంధారి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన గాంధారి వనాన్ని ప్రారంభించారు. గాంధారి వనంలోని సరస్సులో బోట్‌లో విహరించిన అనంతరం గాంధారి వనంలో సుగంధ ద్రవ్యం వెదజల్లే బొడ్డుమల్లి మొక్కను నాటి గాంధారి వనం శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎంపి బాల్క సుమన్ కృషి వల్లనే ఆరు నెలల్లో ఈ గాంధారి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని అన్నారు. ఈ వనంలో ఇంతపెద్ద మొత్తంలో మొక్కలు నాటిన సిబ్బందిని అభినందించారు. అవసరమైతే మరో రూ.2.5కోట్లు మంజూరు చేయించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 29కోట్ల మొక్కలు నాటామన్నారు. అనంతరం ఎంపి బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక తెలంగాణ హరితహారాన్ని ఆకుపచ్చ తలంగాణ కావాలని, అందుకు మనమందరం కృషి చేయాలన్నారు. గాంధారి వనం అభివృద్దిలో డీ ఎఫ్‌వో ప్రభాకర్ చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.