అదిలాబాద్

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును విరమించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 6: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట కాంగ్రెస్ పార్టీ హయంలో చేపట్టిన ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని యదావిధిగా చేపట్టాలని, ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్పును విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రింట్‌మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరిట ముఖ్యమంత్రి కెసిఆర్ నిధుల దుర్వినియోగానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాలోని 16లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యంగా జిల్లాలోని తుమ్మడిహెట్టి వద్ద 160టి ఎంసీల నీటి నిల్వ ఉండేలా 152 ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈయొక్క ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ చెవేళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేశారని, నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు ఎత్తును 148 మీటర్లకు తగ్గించడంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో పిలువకుండా దళిత జాతిని అవమానపర్చే విధంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రాజెక్టును యదావిధిగా నిర్మించడంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆడెల్లు, సుధాకర్, శ్రీదర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సిరికొండను మండల కేంద్రంగా ప్రకటించాలి
* జాతీయ రహదారిపై ఉద్రిక్తత.. రెండు గంటలపాటు రాస్తారోకో * నిలిచిపోయిన వందలాది వాహనాలు

ఇచ్చోడ, సెప్టెంబర్ 6: ఇచ్చోడ మండలంలోని సిరికొండ గ్రామపంచాయతీని మండలకేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మంగళవారం సుమారు 10 గ్రామపంచాయతీలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అఖిలపక్షం అధ్వర్యంలో జరిగిన ఈ అందోళన కార్యక్రమంలో వందలాదిమంది పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలు, డివిజన్లతో పాటు మండలాలను ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు సిరికొండను మండల కేంద్రం గా ప్రకటించాలని గతంలో అనేకసార్లు వినతి పత్రాలు, తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు. అధికారులు, నాయకులు తమ న్యాయమైన డిమాండ్‌ను నిర్లక్ష్యం చేయడం వల్లనే రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సిరికొండ పంచాయతీని మండలకేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే సోన్‌పల్లి, పోచంపల్లి, రాంపూర్, దస్నాపూర్, వాయిపేట్, దాబ, హీరాపూర్ గ్రామపంచాయతీ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పై పంచాయతీల ప్రజలు ఇచ్చోడ, ఇం ద్రవెల్లి మండలాలకు వెళ్లాలంటే సు మారు 20నుండి 30 కి.మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, మొత్తం గిరిజన ప్రాంతాలైనందునా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. సిరికొండ మండలకేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే గిరిజనులకు విద్య, వైద్యం అందుబాటులోకి వస్తుందని, గిరిజనులకు కనీస వైద్యం సకాలంలో అందకపోవడంతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.
జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అందోళనను విరమించుకునేది లేదని తేల్చిచెప్పడంతో స్థానిక ఎస్సై శంకర్ నాయక్, తహసీల్దార్ మోహన్‌సింగ్ సంఘటన స్థలం లో అందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఈ అందోళన ఇంతటితో ఆగేది లేదని, మండలం ఏర్పాటు అయ్యేవరకు అందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అందోళన అదుపుతప్పే ప్ర మాదం నెలకొనడంతో అఖిలపక్షం నాయకులు అందోళనకారులకు నచ్చజెప్పి ఈ ఉద్యమాన్ని పది గ్రామపంచాయతీల సభ్యులను కలుపుకొని అందోళనలు ఉదృతం చేస్తామని నచ్చజెప్పడంతో అందోళన కారులు రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాది సుదీర్‌కుమార్ మద్దతు తెలుపగా, అఖిలపక్షం నేతలు పెంటన్న, షేక్ బసీర్, బాలాజీ, భీంరావు, రజాక్, రాజరాం, నాగుబాయితో పాటు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడలో భారీ ర్యాలీ
సిరికొండను మండలకేంద్రంగా ఏ ర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ఇచ్చోడలో సుమారు 10 గ్రామపంచాయతీలకు సంబంధించిన వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గిరిజనులు సైతం అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సిరికొండ నుండి ఇచ్చోడలోని ప్రధాన వీదుల గుండా సాగింది. సిరికొండ మండలకేంద్రంగా ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు.