అదిలాబాద్

శాంతియుతంగా పండగలు నిర్వహించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 8: గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు బక్రీద్ పండగ ఒకేసారి వస్తున్నందున మత సామరస్యాలతో శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని, ఇందుకోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అదనపు ఎస్పీ జి ఆర్ రాధిక అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ కళాశాల సమావేశ మందిరంలో అన్ని వర్గాల ప్రజలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా ఏ ఎస్పీ రాధిక మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ నేతృత్వంలో జిల్లాలో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ భైంసా, నిర్మల్, ఆదిలాబాద్, ఇచ్చోడ, ఖానాపూర్, ఉట్నూరు తదితర సమస్యాత్మాక ప్రాంతాల్లో డి ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో, మసీద్‌లు, మందిరాలు తదితర ప్రాంతాల్లో పోలీసు ఫికెట్‌లను మోహరించామని, జిల్లా సరిహద్దు ప్రాంతాలైన బాసర్, గూడెం, బాదన్‌కుర్తి, ఇందారం, సోన్ పరిసర ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేయడంతో పాటు అనుమానితులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో పోలీసుల అధ్వర్యంలో ఇప్పటికే శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి, ఇరువర్గాల మత పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకొని జిల్లా అభివృద్దికి పాటుపడాలని అన్నారు. అనంతరం జిల్లా ఓ ఎస్‌డి ఎం ఎస్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ బెల్ట్‌షాపులు మూసివేయడం జరుగుతుందని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజాశాంతికి భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ ఏ.లక్ష్మీనారాయణ, పట్టణ సిఐ ఎన్.సత్యనారాయణ, ట్రాఫిక్ సిఐ యండి షేర్ అలి, టూటౌన్ సిఐ కె.వెంకటస్వామి, ఎస్సైలు జి.రాజన్న, రాజలింగు, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు జంగిలి ఆశన్న, పట్టణ ప్రముఖులు సాజిద్‌ఖాన్, నరేష్ జోషి, ఈర్ల సత్యనారాయణ, బాల శంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.