అదిలాబాద్

ఆర్టీసీ సంస్కరణలతో రూ.300 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8: నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు కార్మికులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఆర్టీసికి ఈ ఏడాది రూ.300 కోట్ల ఆదాయం వచ్చిందని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్సు డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రయాణికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆర్టీసీ సిబ్బందిని సన్మానించి, ఆదిలాబాద్ రీజియన్‌లో గల ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ఆయా డిపో మేనజర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా కొత్తగా 1157 బస్సులను కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు నడుపుతామని, నష్టాలబాట నుండి గట్టెక్కించి కార్మికులు అంకితభావంతో సేవలందిస్తూ రూ.5వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో 750 కోట్ల బడ్జెట్ ఆర్టీసికి కేటాయించగా ఇప్పటి వరకు 350 కోట్లు ఖర్చుచేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ నుండి తిరుపతికి త్వరలో ఏసి బస్సును ప్రారంభిస్తామని చైర్మెన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 6 డిపోల పరిధిలో 628 బస్సుల ద్వారా రోజు రెండున్నర లక్షల మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో నూతనంగా మరో 36 బస్సులతో పాటు బస్సు రూట్ లేని మారుమూల ప్రాంతాలకు 26మిని బస్సుల ద్వారా త్వరలో రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో గతేడాది ఆర్టీసికి రూ.700 కోట్ల నష్టం వచ్చిందని, ప్రభుత్వం, ఆర్టీసి కార్మికుల సహకారంతో సంస్థను నష్టాల నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నామని, ఆదిలాబాద్, మంచిర్యాల నుండి హైదరాబాద్‌కు సమయానికి ప్రయాణికులను చేరవేస్తున్నామన్నారు. బస్సు స్టాండ్‌లు, డిపోలోగల స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి సంస్థకు లాభాలు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం ద్వారా ఆర్టీసి కార్మికులకు గౌరవ ప్రదమైన వేతనాలను అందజేయడం జరుగుతుందని, శాస్ర్తియబద్ధంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని అన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలు జిల్లా యూనిట్‌గానే పరిగణించి, చిన్న జిల్లాల ఏర్పాటులో కేంద్రం నుండి నిధులు అధికంగా రాష్టానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీంతో అభివృద్ది మరింత సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం విజయ్‌కుమార్, డిప్యూటీ సిటిఎం శరత్ ప్రసాద్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ మాధవ్ రెడ్డి, డిపో మేనేజర్ సాయన్న, జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.