అదిలాబాద్

సమూల మార్పులతో అటవీ శాఖ విభజన కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11: జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అటవీ శాఖలో సమూల మార్పులతో అధికారులు, ఉద్యోగుల విభజన కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు రెండు రోజులుగా జరిపిన విభజన మేథోమదనంలో జిల్లాలు, డివిజన్లను యూనిట్‌గా కాకుండా అటవీ శాఖలో ప్రత్యేక అభివృద్ది కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అడవుల సంరక్షణకు, వన్యప్రాణి విభాగాలు, సామాజిక అటవీ విభాగాల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే జిల్లాల విభజన ప్రక్రియను సానుకూల అవకాశంగా మల్చుకొని సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఇంతకు ముందు ఉన్న అటవీ సంరక్షణ కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిని జిల్లా అటవీ అభివృద్ది అధికారి కార్యాలయంగా నామకరణం చేయనున్నారు. అటవీ అభివృద్ది అధికారులు తమ శాఖ పరిపాలన విభాగంలో కీలక పట్టు సాధించే విధంగా అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక అధికారాలు కల్పించనున్నారు. తద్వారా ఈ శాఖను పునర్‌వైభవం సాధించేందుకు వీలుపడుతోందని అంటున్నారు. ఐఎఫ్‌ఎస్ అధికారులను కొత్త జిల్లాల్లో అటవీ సంరక్షణకు బదులు అటవీ అభివృద్ది అధికారి కార్యాలయాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఇందుకు ఉదాహరణంగా ఆదిలాబాద్ జిల్లాను మూడు జిల్లాలుగా ప్రభుత్వం విభజించగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల కలిపి అటవీ సంరక్షణ ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ శాఖలో తరిగిపోతున్న వన సంపద, వన్యప్రాణుల సంరక్షణ, సామాజిక అటవీ విభాగాల పనితీరును మెరుగుపర్చేందుకు ప్రత్యేక సంస్కరణలు తీసుకరానున్నారు. ఇంతవరకు అటవీ శాఖలో రెగ్యులర్ శాఖలకు తోడు వేరు వేరుగా పనిచేస్తున్న సోషల్ ఫారెస్ట్, వన్యప్రాణి విభాగాలను ఒకే గొడుగు కిందకు చేర్చి పాలన పరమైన బాధ్యతలను పెంచాలని నిర్ణయించారు. తద్వారా అటవీశాఖలో ఖాళీగా ఉన్న సుమారు 2500 పోస్టులను త్వరలోనే భర్తీచేసేందుకు కార్యాచరణ రూపొందించారు. గతంలో డివిజన్ స్థాయి కింది విభాగంలో పనిచేసిన సబ్‌డివిజన్ కార్యాలయాలకు బదులు అటవీ అభివృద్ది కార్యాలయాల పేరిట విభజన కసరత్తు సాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఇచ్చోడ, చెన్నూర్, ఖానపూర్‌లో అటవీ అభివృద్ది కార్యాలయాలు ఏర్పాటు చేసి ఐఎఫ్‌ఎస్ అధికారులను నియమించనున్నారు. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ కేంద్రాల్లో అటవీ సంరక్షణ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లకు హరితహారంలో భాగంగా సామాజిక వన విభాగాలు, వన్యప్రాణి విభాగాల సంరక్షణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అటవీ శాఖలో విభజన కసరత్తులో పెను మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొన్ని పోస్టులు తగ్గిపోతాయని, ఖాళీలు ఎక్కువగా ఏర్పడి భారీ ఎత్తున బదిలీలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయి అటవీ సంరక్షణ చర్యలో భాగంగా క్షేత్రాధికారి కార్యాలయాలు జిల్లాకు 8 నుండి 12 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటవీ శాఖలో అధికారులు విభజన ప్రక్రియపై కీలక మార్పులు, పలు సంస్కరణలతో నివేదికను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విన్నవించగా ఇందుకు సానుకూలంగా స్పందించి, సిఎం కసరత్తుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.