అదిలాబాద్

నాటి నాయకులే ఉద్యమాలకు స్పూర్తి....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసిపేట, సెప్టెంబర్ 11: మతోన్మాద బిజెపి, అధికార నిరంకుశత్వాన్ని అవలంభిస్తూ మాటలు అధికం పని తక్కువగా చేస్తున్న తెరాస ప్రభుత్వ పోకడలపై ప్రజలతో కలిసి నాటి సాయుధ పోరాట నాయకుల స్పూర్తితో ప్రజలకు అండగా ఉంటూ కమ్యూనిస్టులు పారాటాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గూండా మల్లేష్ పేర్కొన్నారు. ఆదివారం సోమగూడెంలోని కొమురయ్య భవన్ వద్ద పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాలలో అమరులైన నాయకులను స్మరించుకోవాల్సిన బాద్యత మనపై ఉందన్నారు. నాటి నాయకులు రావి నారాయణరెడ్డి, దొడ్డి కొమురయ్య లాంటి వారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసారని తెలిపారు. నాటి నాయకుల స్పూర్తితో నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న పాలనపై ప్రజల పక్షాన ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. తెరాస అధికారంలో లేని సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలపిందని, నేడు అధికారం చేపట్టగానే త్యాగాలు చేసిన సాయుధ పోరాట నాయకులను అధికారికంగా స్మరించుకోవడంలో వెనుకబాటు వేస్తున్నారని విమర్శించారు. నాడు ఈ నాయకులలే స్పూర్తి దాతలు అన్న కేసిఆర్ నేడు మాట మార్చడం సరికాదని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం 1947లో వస్తే తెలంగాణకు మాత్రం 1948లోవచ్చిందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కొమురం భీంను చంపింది నిజాం రాజులు కారా? అలాంటి వారిని నిజాం చాలా గొప్పవాడు అని కేసిఆర్ కీర్తించడం, మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడంతోనే సరిపోతుందని ఆరోపించారు. రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిపిన సాయుధ పోరాటాలలో ఎంతో మంది నాయకులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపారు. నేడు బిజెపి ప్రభుత్వం కూడ తిరంగా యాత్రలు చేపడుతుందని కాని సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి ఎందుకు పెన్షన్లు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ప్రజలతో ఉంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుందని తెలిపారు. నాటి సాయుధ పోరాట వారొత్సవాలను ఊరూర జరుపు కోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు దాగం మల్లేష్, దర్ని సత్యనారాయణ, జాడి పోశం, లక్ష్మినారాయణ, కల్వల లక్ష్మణ్, సుదర్శన్‌కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.