అదిలాబాద్

మట్టి మనుషుల భాషే..కవుల భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 13: పరాయి భాషపై వ్యామోహం తగ్గించుకొని కవులు, రచయితలు కమ్మనైన ఇంటిభాషపై మక్కువకనవర్చి సాహిత్యానికి ప్రాణంపోయాలని ప్రముఖ సినీ రచయిత, జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆదిలాబాద్‌లోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం తత్వకవి నాగదాసు స్మారక కవి సమ్మేళనం, ప్రముఖకవి టి.చరణ్‌దాస్ రచించిన నెలపొడుపు పుస్తకావిష్కరణకు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, జిల్లా కలెక్టర్ జగన్మోహన్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా నెలపొడుపుకవితా సంపుటి ఆవిష్కరణలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తెలంగాణ మాండలికంలో ఆదిలాబాద్ జిల్లా భాష, యాసకు వైవిద్యం ఉందని, అచ్చమైన అమ్మభాషను ఎంచుకొని కవిత సంపుటిని ఆవిష్కరించడం అభినందించదగిన విషయమని అన్నారు. ఇంటి భాషపై పట్టుపెంచుకుంటూ తమ జీవన వైవిద్యాన్ని సులభశైలిలో ఆవిష్కరించే రచనలు సమాజానికి దోహదం చేస్తాయని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ కవులు ఉదారి నారాయణ, రాడపు సంతోష్, గోపగాని రవిందర్‌తో తనకు ముందునుండి సాన్నిహిత్యం ఉందని, ఆదిలాబాద్‌జిల్లాలో రచయితలకు కొదవలేదని అన్నారు. పరాయిపాలనలో తెలంగాణ భాష కాస్త వివక్షతకు గురైన విషయం వాస్తవమేనని, ప్రస్తుతం వర్తమాన కవులు, రచయితలు తమ కవితల్లో గ్రామీణ వాతావరణాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ కవులు ఎలాంటి బేషజాలు లేకుండా ధైర్యంగా అచ్చమైన యాసలో రచనలు సాగించాలని సూచించారు. మట్టి మనుషుల భాషే కవుల భాషగా ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే అభ్యుదయ రచయితలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాణం పోస్తున్నారని, ముఖ్యంగా తాష్కండే చరణ్‌దాస్ రచించిన నెలపొడుపు కవితా సమాహారం ఆణిముత్యంగా నిలిచిపోతుందని అన్నారు.
మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి కవులు సాహిత్యంపై పట్టుపెంచుకొని ముందుకు రావడం పట్ల అభినందిస్తూ జిల్లా రచయితల వేదికను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ తాను రచించిన శ్రమకావ్యంపై వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, ప్రముఖ జిల్లా వైద్యులు డాక్టర్ చందు, రచయిత మెట్టుపల్లి శంకరయ్య, గోపగాని రవీందర్, చిందం ఆశన్న తదితరులు పాల్గొన్నారు.