అదిలాబాద్

పడిపోయిన పచ్చిమిరప ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 19: వంటింట్లో తప్పనిసరిగా వినియోగించే పచ్చిమిర్చి ధర అమాంతం పడిపోయింది. నిన్న మొన్నటి వరకు చుక్కల్లో చేరిన ధరలతో కన్నీరుపెట్టించిన పచ్చిమిరప ఒకేసారి కిలో రూ.10 లకే వినియోగదారులకు అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సోమవారం నిర్మల్‌లోని రైతు బజార్‌లో మిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.10 నుండి 15 లకు విక్రయించడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మిర్చితోపాటు కూరగాయల ధరలు కూడా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. గత రెండు నెలలుగా రూ.100 నుండి 150 వరకు కిలో ధర పలికిన పచ్చిమిర్చి ధరలు అమాంతం పడిపోవడానికి స్థానికంగా దిగుబడులు పెరగడమే కారణమంటున్నారు. ఈయేడు ఖరీఫ్ ఆరంభంలోనే ఆశించిన వర్షాలు కురియడంతో సాధారణ పంటలకు బదులుగా రైతులు కూరగాయల పంటలను సాగుచేసేందుకు మొగ్గుచూపారు. దీంతో ఒకేసారి పంట దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తడంతో రైతన్నకు ఆశించిన ధర లభించడం లేదు. హోల్‌సెల్ మార్కెట్‌లో కేవలం రూ.500 లకే క్వింటాల్ మిర్చిని విక్రయించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గత 15 రోజుల క్రితం వరకు 3 నుండి 4 వేలకు క్వింటాలు పలికిన మిర్చి ధరలు ఒకేసారి పడిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అధిక దిగుబడుల వల్లే....
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆరుతడి పంటలకు అనుకూలంగా అడపాదడపా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల ఇతర పంటలతోపాటు కూరగాయల దిగుబడులు అధికంగా వచ్చాయి. నిర్మల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని నిర్మల్, దిలావర్‌పూర్, సారంగాపూర్, మామడ, మండలాల్లో రైతులు ఎక్కువగా కూరగాయలను సాగుచేశారు. ఆయా గ్రామాల్లో పండించిన కూరగాయల పంటల దిగుబడులు పెద్ద ఎత్తున రావడంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్ లేకుండా పోయింది. దీంతో రైతులు అందినకాడికి విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట దిగుబడుల నిల్వకోసం అవసరమైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయలు ఇతర పండ్లరకాలను ఎక్కడికక్కడ నిల్వచేసుకుని డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకునే విధంగా కోల్డ్ స్టోరేజిలను ఏర్పాటుచేస్తే రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.