అదిలాబాద్

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, సెప్టెంబర్ 22: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జితేందర్‌రెడ్డి అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని కస్తుర్భా పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ విద్యావ్యాప్తికి కృషిచేయాలని సూచించారు. భోజన సౌకర్యం, నీరుతోపాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. వీరివెంట ఎంపిడివో సాయిరాం, ఎంఈవో దయానంద్, కస్తుర్భా పాఠశాల ప్రిన్సిపాల్ వాణి తదితరులు ఉన్నారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేపట్టి రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తంచేశారు.
శిశు సంరక్షణపై నిర్లక్ష్యం వద్దు....
శిశు, బాలబాలికల సంరక్షణపై నిర్లక్ష్యం వహించరాదని జడ్పీ సిఈవో జితేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న వసతులపై ఆరాతీశారు. శిశువులకు, గర్భిణీలకు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో అందిస్తున్న వసతులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.