అదిలాబాద్

తగ్గని వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, సెప్టెంబర్ 26: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ఉదృతి కొనసాగుతోంది. ఎగువ కురిసిన వర్షాలు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేతతో సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా చేరడం వల్ల ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తివేయడంతో 3.92లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వొదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 3.80లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం 147.2 మీటర్లు ఉంది. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148మీటర్లు కావడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం పెరగడంతో ఆదివారం 39గేట్లు ఎత్తివేయగా, మోస్తారుగా వరద నీరు తగ్గడంతో రెండు గేట్లు మూసివేసి, 37గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వొదులుతున్నామని ఇరిగేషన్ అధికారి తెలిపారు. అదేవిధంగా ర్యాలీవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 0.408టీ ఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులోకి 250క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఔట్‌ఫ్లో కూడా 250క్యూసెక్కులు ఉందని ప్రాజెక్టు ఏ ఈ సుదాకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.