అదిలాబాద్

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ అన్నారు. మంగళవారం వరద ప్రభావిత పంటక్షేత్రాలను నరేష్ జాదవ్ పరిశీలించారు. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ, తలమడుగు, బోథ్ మండలాల్లో సోయాబీన్ పంట పూర్తిగా దెబ్బతిందని, సోయాబీన్ గింజలకు మొలకలు వచ్చి పూర్తిగా నష్టాన్ని మిగిల్చిందన్నారు. జిల్లాలో ఫసల్‌బీమా యోజన కింద సోయాబీన్ రైతులు 103 కోట్ల ప్రీమియాన్ని చెల్లించినందున వరదలతో నష్టపోయిన సోయాబీన్, పత్తి, కంది, టమాట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నష్టం అంచనాల్లో నిర్లక్ష్యం వహిస్తోందని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.