అదిలాబాద్

మహిళల చైతన్య దీపిక.. బతుకమ్మ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, అక్టోబర్ 1: మహిళల్లో చైతన్యాన్ని, తెలంగాణ సమాజంలో ఐక్యతను చాటిచెప్పే పువ్వుల పండగ బతుకమ్మ వేడుకలను ఈనెల 9వరకు గ్రామాలు, పట్టణాల్లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయాలని, జిల్లాకు ఈ పండగ కోసం రూ.20 లక్షలు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలకు సంబంధించి జిల్లా కలెక్టర్ డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సంధ్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసే బతుకమ్మ పండగ సంధర్భంగా సంబంధిత అధికారులు ప్రతి రోజు పర్యవేక్షిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని, ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు కూడా ఉంటాయని అన్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది మహిళలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించి, గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కేవిధంగా ఏర్పాట్లు గావించాలన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఐక్యమత్యాన్ని పెంచేందుకు బతుకమ్మ పండగ ఉత్సవాలు చాలా ఉపయోగపడుతాయని, అందుకు ప్రభుత్వం అధిక శ్రద్ద తీసుకొని గ్రామ స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ ఉత్సవం ద్వారా రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకరావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, గ్రామ స్థాయి నుండి బతుకమ్మ ఉత్సవాలపై మహిళల్లో చైతన్యం తీసుకరావడానికి అన్ని గ్రామాలలో, మండలాల్లో, డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలో బ్యానర్లను ఏర్పాటు చేయాలని, నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాలలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని ఇందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు రూ.10లక్షలు మంజూరుకాగా, నూతనంగా ఏర్పడనున్న నిర్మల్, కొమరంభీం జిల్లాలకు రూ.5లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయని అన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ ఆడే ప్రాంతంతో పాటుగా నిమజ్జనల ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, ప్రమాదాలు జరగకుండా రక్షణ ఏర్పాటు చేయాలని, తహసీల్దార్లు, ఎంపిడీవోలు ఏర్పాట్లను సమీక్షించాలని అన్నారు. పట్టణాలో మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులకు ఏర్పాటుచేసిన వాహనాల ద్వారా గ్రామాల్లో బతుకమ్మ కార్యక్రమంపై పాటల ద్వారా చైతన్యపర్చాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అనురాగ్, డిఆర్‌వో సంజీవరెడ్డి, జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి, సమాచార శాఖ ఏడి బి.రవికుమార్, ఆదిలాబాద్ మున్సిపల్ కమీషనర్ మంగతాయారు, కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ సుశీల, ఆదిలాబాద్ తహశీల్దార్ వర్ణ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి ఏరియాలో 90శాతం బొగ్గు ఉత్పత్తి
* జనరల్ మేనేజర్ రవిశంకర్
తాండూర్, అక్టోబర్ 1: బెల్లంపల్లి ఏరియాలోని మూడు ఓపెన్‌కాస్టులలో గడిచిన సెప్టెంబర్ మాసంలో 462600 టన్నులకు గాను 417235 టన్నులతో 90శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జిఎం రవిశంకర్ తెలిపారు. గోలేటిలోని జిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏరియాలోని డోర్లి ఓసిపి-1ఎలో 132000 టన్నులకు గాను 155230 టన్నులతో 118శాతం, కైరిగూడ ఓసిపిలో 260000 టన్నులకు గాను 235800 టన్నులతో 91శాతం, బిపిఎ ఓసిపి-2 ఎక్స్‌టెన్షన్‌లో 70000టన్నులకు గాను 26205 టన్నులతో 37శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనలో భాగంగా గడిచిన ఏప్రిల్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు 2954000 టన్నులకు గాను 2741175 టన్నులతో 93శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 3న సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ రూ.18వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.9వేలు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో ఈనెల 9న గోలేటిలో సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ సంబురాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, కార్మిక కుటుంబాలు బతుకమ్మ సంబురాలను జయప్రదం చేయాలని జిఎం కోరారు. సమావేశంలో ఎస్వోటు జిఎం కొండయ్య, డిజిఎం (పర్సనల్) రాజేశ్వర్, సుదర్శన్, అధికారులు పాల్గొన్నారు.

బాసరలో వేడుకగా శారదీయ నవరాత్రి ఉత్సవాలు
* ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
* బంగారు హారాన్ని అమ్మవారికి ప్రధానంచేసిన భక్తులు
బాసర, అక్టోబర్ 1: సుప్రసిద్ద పుణ్యక్షేత్రం సరస్వతిమాత కొలువుదీరిన బాసర అమ్మవారి సన్నిధిలో శనివారం శారదీయ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయంలో కొలువుదీరిన శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మద్య అభిషేక, అర్చన పూజలు నిర్వహించారు. అనంతరం కళశపూజ, ఘటాస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఈవొ వెంకటేశ్వర్లు, సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు, ఛైర్మెన్ శరత్‌పాఠక్, మాజీ పి ఎసి ఎస్‌ఛైర్మెన్ నూకం రామారావు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘటాస్థాపనతో అంకురార్పన చేశారు. అమ్మవారి యాగమండపంలో అర్చకులు, వేదపండితులు సప్తశతి పారాయణం, సరస్వతి సహస్రనామం, గాయత్రిజపం, నిత్యచంఢీ హవనము తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదీతీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం సరస్వతి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ చిన్నారులకు అమ్మవారి అక్షరాభ్యాస మండపాల్లో భక్తులు అక్షరస్వీకార పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు నాందేడ్ గడిపురకు చెందిన బాబా జగదీశ్ మహారాజ్ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఉచిత అన్నప్రసాద వితరణను నిర్వహించారు. భక్తులకు ఆలయ సన్నిధిలో బాసరకు చెందిన లక్ష్మికాంత్ ప్రసాద వితరణ చేశారు. ముధోల్ ఎమ్మెల్యే సరస్వతి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ఫోటోను, ప్రసాదాన్ని అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు బాసర ఎస్సై మహేష్ గట్టిబందోబస్తును ఏర్పాటుచేశారు.
అమ్మవారికి బంగారు హరం అందజేత....
బాసర సరస్వతిదేవి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం భైంసా పట్టణానికి చెందిన జి.రమేష్ దంపతులు రెండు తులాల బంగారు హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఉత్సవాల్లో అమ్మవారి సేవలో దీన్ని వినియోగించాలని అధికారులను కోరారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాతలను ఘనంగా సత్కరించారు.