అదిలాబాద్

బ్రహ్మచారిణి అవతారంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, అక్టోబర్ 2: బాసర సన్నిధిలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రెండవ రోజు సరస్వతి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు ఉదయం నుండి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూలైన్‌లో బారులు తీరారు. తమ చిన్నారులకు అమ్మవారి సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాస మండపాల్లో అక్షరస్వీకార పూజలు నిర్వహింపచేశారు. అనంతరం భక్తులు ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లుచేపట్టారు. అమ్మవారి దర్శనసేవలకు విచ్చేసే భక్తుల కోసం మహారాష్టల్రోని ధర్మాబాద్‌కుచెందిన కమలాకర్ ప్రసాదం పంపిణి చేశారు. 5 వేలకు పైగా భక్తులకు ఉచిత ప్రసాద వితరణ నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. హైదరాబాద్‌కు చెందిన జ్యోతి శేఖర నాట్య నిలయం తరపున కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.