అదిలాబాద్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 2: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పట్టణంలోని జుమ్మెరాత్‌పేట్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి సతీమణి విజయలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులు అల్లోల వినోదమ్మ, మురళిధర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి కోలాటాలు ఆడారు. బతుకమ్మ పాటలు పాడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మపాత్ర ఎంతో ప్రాధాన్యతతో కూడిందన్నారు. ఉద్యమ సమయంలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు ఆడుతూ ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేశారన్నారు.తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తూ బతుకమ్మ ఆటా,పాటల ద్యారా ఉద్యమానికి మహిళలు ఊపిరులూదారని అన్నారు. పూలను పూజించే బతుకమ్మ పండుగలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివొ శివలింగయ్య, తెలంగాణ జాగృతి రాష్ట్ర యూత్ అధ్యక్షులు హైదర్ షెహన్‌షా, జిల్లా అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, మేడారపు అపర్ణ ప్రదీప్, ముడుసు ప్రవళిక సత్యనారాయణ, జాగృతి నిర్మల్ కన్వీనర్ లక్ష్మణాచారి, తహసిల్దార్ జాడి రాజేశ్వర్, టి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

బాపూజీ చూపిన మార్గంలో నడువాలి
* మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 2: భారత జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడువాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శాంతినగర్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి గాంధీజి 147వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా గాంధీజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంకోసం గాంధీజి కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అలాల అజయ్, అంబకంటి సుష్మ అశోక్, దోని జ్యోతి, భూమన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సంజీవ్‌రెడ్డి, యాసం నర్సింగ్‌రావు, షకీల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఎల్లంపల్లిలో పెరిగిన ఇన్‌ఫ్లో...
* 28గేట్ల ఎత్తివేతతో గోదావరిలోకి నీరు
మంచిర్యాల, అక్టోబర్ 2: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువన కురుస్తున్న వర్షం నీటితో ఉదృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 148మీటర్లు కాగా, ప్రస్తుతం 146.85మీటర్లలో ప్రాజెక్టులో నీరు నిలవడంతో ఇన్‌ఫ్లో 1,32,156 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి అధికారులు 2,76,332 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. వరద నీటి ఉదృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి దివకు వదులుతామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అదేవిధంగా ర్యాలీవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు ఉండటంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 0.408 టి ఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోని ఇన్‌ఫ్లో 250క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా, ఔట్‌ఫ్లో 250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

మహాత్ముని ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్దాం
* మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 2: మహాత్ముని ఆశయాల స్ఫూర్తితో గ్రామస్వరాజ్యం నిర్మాణానికి ప్రతి ఒక్కరు ప్రతినబూనాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా అన్నారు. ఆదివారం జాతిపిత గాంధీజి 147వ జయంతి సంధర్భంగా పట్టణంలోని గాంధీజి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ శాంతియుత మార్గమే ఆయుదంగా బ్రిటీష్ పాలకులను ఎదురించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజి ఆశయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు సాజిదోద్దిన్, రాష్ట్ర నాయకులు రంగినేని పవన్‌కుమార్, జడ్పీటీసీ విజ్జగిరి అశోక్, కౌన్సిలర్లు సత్యనారాయణ, ఆశోక్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.