హైదరాబాద్

అగ్నిగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండిపోతున్న ఎండలు
రికార్డు స్థాయిలో
ఉష్ణోగ్రతల నమోదు
మధ్యాహ్నం ‘కర్ఫ్యూ’ను
తలపిస్తున్న మెయిన్‌రోడ్లు
అనధికార కరెంటు కోతలు మొదలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 18: వేసవి ఎండలు మండిపోతుండటంతో మహానగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. గడిచిన మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదు కాగా, తాజాగా గురువారం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. అయినా రోడ్డుపై వడగాలులు వేడిమి పెరగటంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జనం జంకుతున్నారు. ముఖ్యంగా మూడురోజుల క్రితం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకు ముందు కూడా ఎండలు బాగా మండిపోయినా ఒకే చోట ఎండలు నిల్చుంటే దాని ప్రభావం తెలిసేది. బైక్‌పై ప్రయాణించినా, పెద్దగా ప్రభావం కన్పించేది కాదు. మూడురోజుల క్రితం 43 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన తర్వాత వడగాలులు, వేడిమి కూడా పెరగటంతో మధ్యాహ్నం పూట కూడా వాహనాల రాకపోకలకు రద్దీగా ఉండే పలు మెయిన్‌రోడ్లు సైతం నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా రోడ్లపై వడగాలులు వీయటంతో జనం ఆందోళన చెందుతున్నారు.
ఎండ మండిపోవటంతో పాటు వడగాలులు ప్రభావం కూడా ఉండటంతో అత్యవసరం అయితే తప్ప జనం బయటకు రాకుంటే మంచిందని వైద్యులు, పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. వేడిమి, ఉక్కపోత పెరిగిపోవటంతో చల్లదనం కోసం ప్రజలు ఫ్యాన్లు, ఏసిలు, కూలర్ల వినియోగం పెరిగింది. ప్రభుత్వం చెబుతున్న విధంగా గతంలో మాదిరిగా అధికారికంగా కరెంటు కోతలు లేకపోయినా, కొద్దిరోజులుగా పేదలు నివసించే పలు ప్రాంతాల్లో అనధికారి కరెంటు కోతలు అమలవుతున్నాయి. సర్కారు కావల్సిన స్థాయిలో విద్యుత్‌ను కొనుగోలు చేసి మరీ సరఫరా చేస్తున్నపుడు ఈ కోతలేమిటీ? అని ప్రశ్నించగా, వినియోగటం పెరగటంతో విద్యుత్ లైన్లు ట్రిప్ అవుతున్నాయని, వాటికి మరమ్మతులు చేపడుతున్నామంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు. పగటి పూట రెండు, మూడు సార్లు అరగంట చొప్పున, అర్థరాత్రి ఉన్నట్టుండి గంట నుంచి రెండు గంటల పాటు కరెంటు సరఫరా నిల్చిపోవటంతో జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళ తప్పని పరిస్థితుల్లో బయటకు రావల్సి వచ్చినా, తగిన జాగ్రత్త పాటించాలని కూడా సూచిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్, బేగంపేట ఫ్లై ఓవర్లతో పాటు సచివాలయం రోడ్డు సైతం మధ్యాహ్నం పనె్నండు గంటల తర్వాత రాకపోకల్లేక కర్ఫ్యూ వాతవరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి ఉపశమం కల్గించే శీతలపానీయాలు, చల్లగాలినిచ్చే కూలర్లు, ఫ్యాన్ల విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. కూలర్ల విక్రయాలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయని, తమ కష్టానికి తగిన ఫలితం దక్కుతోందని సీజనల్‌గా కూలర్లు తయారు చేసుకుని అమ్ముకునే సుల్తాన్‌బజార్‌కు చెందిన కొందరు చెబుతున్నారు.