హైదరాబాద్

అడ్డు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: వర్షాకాలం సమీపిస్తోం ది..గట్టిగా వర్షం కురిసినపుడు నాలాల్లోని నీరు సక్రమంగా ప్రవహించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలి. అందుకు అడ్డంకిగా మారిన ఆక్రమణలను వెంటనే యుద్ధప్రాతిపదికన తొలగించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన నాలాలపై వెలసిన ఆక్రమణలు, తొలగింపునకు చేపట్టాల్సిన చర్యలపై టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో కేవలం ఎండాకాలం ముగిసేలోపు వర్షాకాలం ప్రారంభానికి ముందే నాలా పూడికతీత పనులను చేపట్టేవారు. కానీ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు నాలాల పూడికతీత పనులు నిరంతరంగా చేపట్టారు. నగరంలో మొత్తం 370 కిలోమీటర్ల పొడువున ఉన్న నాలాలపై వెలసిన ఆక్రమణలపై ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడిన బృందం సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే! గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్రమణలను గుర్తించటంతో పాటు ఆక్రమణలకు మార్కింగ్ చేయటంతో పాటు వాటిని తొలగించేందుకు క్షేత్ర స్థాయిలో లీగల్ పరంగా ఎదురయ్యే అడ్డంకులను కూడా ఇప్పటికే అంచనా వేసినందున, భారీ వర్షం కురిసినపుడు ఎక్కువగా ప్రవహించే నీటికి అడ్డంకిగా మారిన ఇరుకైన మలుపుల్లోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ రకంగా అన్ని నాలాలపై ముఖ్యమైన ఇరుకైన మలుపుల్లో దాదాపు 842 ఆస్తులను గుర్తించినట్లు ఆయన వివరించారు. ఇలాంటి ఆక్రమణలు ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లయితే తొలుత నోటీసులిచ్చి, స్థల యజమానికి ఎవరన్న విషయాన్ని నిర్థారించుకున్న తర్వాతే నాలాల విస్తరణకు స్థల సేకరణ చేసిన తర్వాత నేలమట్టం చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేసేందుకు మరో సారి ఆక్రమణలను క్షేత్ర స్థాయిలో టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు తనిఖీ చేయాలని కూడా కమిషనర్ సూచించారు. ఆ తర్వాత నాలా పరివాహక ప్రాంతాల్లో, ఇరువైపులా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిని తొలుత అవగాహనవంతులను కూడా చేయాలని ఆయన సూచించారు. భారీ వర్షాలు కురిసినపుడు లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఉండాలంటే నాలాలను వెడల్పు చేయటంతో పాటు వాటికిరువైపులా వెలసిన ఆక్రమణలను తొలగించాలన్న అంశంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. వానాకాలం సమీపించటంతో నాలాల ఆక్రమణల విషయాన్ని తెరపైకి తెచ్చిన జిహెచ్‌ఎంసి అధికారులు వాటి తొలగింపునకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తలెత్తే రాజకీయ అడ్డంకులను ఎలా అధిగమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.