నమ్మండి! ఇది నిజం!!

నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవిత భాగస్వామి మరణిస్తే భార్య లేదా భర్త ఒక్కొక్కరు ఒకో రకంగా స్పందిస్తారు. అవి సాధారణంగా మద్యం, పునర్వివాహం లాంటివి అయి ఉంటాయి. కాని కొందరు మరణించిన తమ జీవిత భాగస్వామి విషయంలో సృజనాత్మకతతో కూడిన ప్రేమతో స్పందించారు. అలాంటి వారిలో ఒకరు ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్ ప్రాంతంలోని విక్‌వార్‌కి చెందిన బెరెఫ్ట్ విన్‌స్టన్ హోలెస్ట్.
హోలెస్ట్ భార్య జానెట్ 1999లో మరణించింది. ఆమె గుర్తుగా విన్‌స్టన్ ఏమైనా చేయాలని అనుకున్నాడు. అతను రైతు కాబట్టి తన భార్య మీద తనకి గల ప్రేమకి చిహ్నంగా పొలంలో ఓక్ మొక్కలని పాతి పెంచసాగాడు. తండ్రికి అతని కొడుకు కూడా ఈ విషయంలో సహాయం చేశాడు. ఐతే మధ్యలో ఓ ఎకరం నేల మీద హృదయాకారంలో ఓక్ మొక్కలని నాటనే లేదు! ఈ పనిలో అతను భార్య మరణం నించి ఓదార్పు పొందాడు. ఆ హృదయం కోణం తన భార్య బాల్యంలో నివసించిన ఒరు వాటన్ హిల్ వైపు చూపిస్తూంటుంది. మొక్కలు వృక్షాలవడానికి ఎనిమిదేళ్లు పట్టింది. ఐతే పదిహేడేళ్ల దాకా ఈ హృదయాకారపు ఖాళీ నేల గురించి ప్రపంచానికి తెలీదు.
జనవరి 2016లో హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించిన, రవాణా వ్యాపారస్థుడు ఏండి కోవెట్ (42) అనుకోకుండా ఆ ఓక్ వృక్ష సముదాయాల మీంచి వెళ్తూన్నప్పుడు వృక్షాలు లేని హృదయాకారపు నేల కనిపించింది. దాన్ని ఫొటో తీసి అతను పత్రికలకి అమ్మాడు.
‘ఆకాశంలోంచి కనపడ్డ ఆ హృదయాకారపు నేలని చూసి నా కళ్లని నేనే నమ్మలేకపోయాను. ఆకాశంలోంచి తప్ప చుట్టూ ఓక్ వృక్షాలు అడ్డు ఉండటంతో నేల మీంచి ఇది కనపడదు. ఇది ఓ భర్తకి తన భార్య మీద గల చాలా చక్కని ప్రేమ కథ.’ కోవెట్ చెప్పాడు.
70 ఏళ్ల విన్‌స్టన్‌ని పత్రికా విలేకరులు దీని గురించి ప్రశ్నిస్తే 33 ఏళ్లు కలిసి జీవించాక మరణించిన తన భార్య జానెట్ జ్ఞాపకార్థం తను 6,000 ఓక్ మొక్కలని అక్కడ నాటానని ఆయన చెప్పాడు.
తరచు తను అక్కడికి వెళ్లి కూర్చుని ఆమె గురించి ఆలోచిస్తూంటానని కూడా చెప్పాడు. విన్‌స్టన్‌కి గల 112 ఎకరాల పొలంలోని ఆరు ఎకరాలని దీని కోసం వినియోగించాడు. తన ఫార్మ్‌హౌస్‌లోనే బస చేసి అతను కొన్ని నెలలపాటు ఆ ఓక్ మొక్కలను నాటాడు. ఆ హృదయాకారం నేలకి ఓ కాలిబాట ద్వారా మాత్రమే చేరుకోగలం. వసంతంలో హృదయాకారంలోని ఖాళీ నేల నండా డేఫొడిల్ పూల మొక్కలని నాటుతాడు. 2011లో ఆఖరిసారి విన్‌స్టన్ హెలికాప్టర్‌లోంచి ఈ హృదయాన్ని చూశాడు.
ఇప్పుడు విన్‌స్టన్ వయసు 70. దీన్ని టూరిస్ట్ అట్రాక్షన్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరించమని కొన్ని టూరిస్ట్ కంపెనీలు ఆయన్ని అడుగుతున్నాయి.
ఇలాంటిదే మరో భార్యాభర్తల ప్రేమ కథ. ఇది అమెరికాకి చెందింది. మరణించిన తన భార్య మీద ఓ భర్తకి గల ప్రేమకి చిహ్నంగా ఆయన తొలిసారి కవి అయిన విశేషం ఇది. ఇల్లినాయ్‌లోని ప్యుయోరియా అనే ఊరికి చెందిన ఫ్రెడ్ స్టౌబోగ్ రెండు పాటలు రాశాడు. ఒకటి మిస్సోరిలోని బ్రాన్సన్ గురించి. మరొకటి భార్య లొరైన్ మీద తనకి గల ప్రేమ గురించి.
ఆన్‌లైన్ సాంగ్ రైటర్/ సింగర్ పోటీని నిర్వహించిన గ్రీన్ షో స్టూడియోకి 2016లో ఫ్రెడ్ చేత్తో రాసి పంపిన ‘ఓ స్వీట్ లొరైన్’ అనే పాట అందింది. 75 ఏళ్లు కలిసి జీవించాక ఏప్రిల్ 2016లో లొరైన్ మరణించింది. ఆ విషాదంలో తను ఆ పాట రాసానని ఫ్రెడ్ ఆ ఉత్తరంలో రాశాడు. దాన్ని పరిశీలించిన వారు తీవ్రంగా స్పందించి ఫ్రెడ్‌ని కలిశారు. భార్య మీద తనకి గల ప్రేమ గురించి విన్నాక వారు ఆ పాటని వృత్తిపరంగా రికార్డు చేయడమే కాక, వారి ఫొటోలతో కూడిన చిన్న డాక్యుమెంటరీని తీసి యూ ట్యూబ్‌లో పెట్టారు.
బ్రిటన్ నించి వెలువడే డైలీ మెయిల్‌లో ఇది ప్రముఖంగా ప్రచురించారు. ఆస్ట్రేలియాకి చెందిన ఓ టీవీ ఛానల్‌లో కూడా ఈ సమాచారం చెప్పారు. ఆ వీడియోలో ఫ్రెడ్, లొరైన్‌ల వైవాహిక జీవితంలో తీసుకున్న ఫొటోలని చూపించారు.
‘నా భార్య చాలా అందమైంది. మొదటి చూపులో అక్కడికి అక్కడే ప్రేమలో పడ్డాను. సుదీర్ఘ జీవనయానం తర్వాత లొరైన్ మరణించాక ఓ సాయంత్రం నేను ఒంటరిగా కూర్చుని ఉండగా ఈ పాట, బాణీ వాటంతట అవే నాకు స్ఫురించాయి. దాన్ని వెంటనే పాడాను’ ఫ్రెడ్ డైలీ మెయిల్ విలేకరికి చెప్పాడు.
రికార్డ్ అయిన ఆ పాటని ఫ్రెడ్ మొదటిసారి విన్నప్పుడు ఎటో చూస్తున్న ఆయన కళ్లల్లో నీళ్లు తిరగడం డాక్యుమెంటరీ చివర్లో కనిపిస్తుంది. దాని పేరు ఏ లెటర్ ఫ్రం ఫ్రెడ్: ది కంప్లీట్ స్టోరీ. దీనికి ప్రేక్షకులు కూడా బాగా స్పందించారు. ఫేస్‌బుక్ ద్వారా దీని ప్రచారం లభించి, చేతి రుమాల దగ్గర ఉంచుకుని చూడాల్సిన డాక్యుమెంటరీగా దీనికి బాగా పేరు వచ్చింది. అరవై పైబడ్డ ప్రేక్షకులే కాక యువత కూడా దీనికి స్పందించారు. ఫ్రెడ్‌కి ఇప్పుడు 96 ఏళ్లు.
మరణించిన తన భర్త మీద ఓ భార్యకి గల ప్రేమకి చిహ్నంగా ఆమె జరిపే ఓ వింత సాహసం ఇది. తన 70వ పుట్టిన రోజుని జెన్ గ్రీన్ విమానంలోంచి స్కైడైవింగ్ చేసింది. 44 ఏళ్ల క్రితం స్కైడైవ్ చేస్తూ పేరాచ్యూట్ తెరచుకోకపోవడం వల్ల మరణించిన తన భర్త టామ్ ఫిలిప్స్‌కి నివాళిగా ఆయన మరణించిన రోజున ఇలా స్కైడైవింగ్ చేస్తోంది. కాలిఫోర్నియాలోని ఓ ఎయిర్ట్ నించి బయలుదేరిన ఓ విమానంలోంచి దూకి ఆమె మరణించాడు. ఏటా ఆ విమానాశ్రయం నించే ఆవిడ బయలుదేరి స్కైడైవింగ్ చేస్తోంది. టామ్ జీవించి ఉండగా స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. జెన్‌కి తన కాబోయే భర్తతో స్కైడైవింగ్ విద్యార్థినిగా పరిచయం. పెళ్లయ్యాక దంపతులుగా వారిద్దరూ కలిసి 69 సార్లు స్కైడైవింగ్ చేశారు. టామ్‌కి స్కైడైవింగ్ అంటే ఎంత ఇష్టం అంటే తను మరణించాక తన చితాభస్మాన్ని స్కైడైవ్ చేసి దూకే పసిఫిక్ మహాసముద్రంలో కలపమని వీలునామా కూడా రాసాడు.

-పద్మజ