ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( అక్టోబర్ 16 నుండి 22 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆదాయ వ్యయాలు పరీక్షిస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. కార్యాలు సామరస్యంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు, అనుకోని అత్యవసర పనులు మిమ్మల్ని ఆలోచింపజేయనున్నాయి. మీ హితులు మీ మార్గదర్శకత్వంలో వృద్ధి పొందుతారు. దంపతులు వదంతులకు అవకాశమివ్వకండి. పనులను సంతృప్తితోనే చేయండి. పోటీ పరీక్షలకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అనుభవం, పర్యవేక్షణ ఉపకరిస్తుంది. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలందుకుంటారు. చుట్టూ ఉన్న వారిని అతిగా నమ్మకండి. మీ పనులకు ఆటంకం లేకుండా చూసుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

బరువు బాధ్యతలను బేరీజు వేసుకొని శ్రమకు మించి వ్యవహరించకండి. శుభకార్యాలు మెల్లగా సానుకూలమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. విదేశీ ప్రయాణ యత్నాలు, శుభ కార్య యత్నాలు ఆలోచింపజేస్తాయి. అధిక ఆదాయ ప్రయత్నాలు కుంటుపడతాయి. ఖర్చు మితంగా ఉండేట్టు చూసుకోవాలి. దంపతులు కొత్త జీవితాన్ని గడుపుతారు. ఇతరులకు మార్గదర్శకత్వ విషయంలో జాగ్రత్త వహించండి. బ్యాంకు అప్పులు మీ స్వంత విషయాలకైతేనే ప్రయత్నించండి. మొహమాటాలు ఇబ్బందికరం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

సౌలభ్యంతో కార్యసిద్ధి. అవసరమైన పనులలో వెనుకంజ వేయకుండా జాగ్రత్త పడాలి. విందులు, ఆధ్యాత్మిక కార్యకలాపాలందు ఇష్టులతో కలిసి పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ విస్తరణ, అదనపు బాధ్యతలు చేపడతారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయాల్లో మెళకువలు పాటించాలి. దంపతులు సమాజంలో మీదైన రీతిలో గుర్తింపు పొందుతారు. ప్రయాణాదులందు ఇతరుల సాయం తీసుకోవాల్సి వస్తుంది. ఆదాయం తృప్తికరంగా ఉంటుంది. అధిక ఖర్చులకు కళ్లెం వేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఉపాథికి దారి తీస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. మిత్రులు మీకు చేదోడువాదోడుగా ఉంటారు. సంతానానికి శుభం ప్రాప్తిస్తుంది. దంపతుల మధ్య అవగాహన మెరుగవుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలం. నిరద్యోగులకు శ్రమానుకూలంగా ఉద్యోగావకాశాలు. తోటి వారి సహాయం అవసరానికి అందుతుంది. ఉద్యోగ వృత్తి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి. సన్నిహితులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. అనుకోని బకాయి పైకం అందవచ్చు. స్ర్తిలు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఏకాగ్రత అన్నింటా మేలు చేస్తుంది. ఏ పనినైనా పట్టుదలతో సాధిస్తారు. అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు చెప్పి చేయండి. తొందరపాటు నిర్ణయాలు ఆందోళన కల్గించవచ్చు. ఇబ్బంది పెట్టే సిబ్బంది కూడా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. నిరుత్సాహం కూడదు. ఆర్థిక పుష్టి వున్నా రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి. భవిష్యత్తుకై ప్రణాళికలు వేయండి. మీ ఆశయాలు నెరవేరుతాయి. స్ర్తి పురుషులు సంఘంలో పేరు పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఇష్టంగా సమయపాలనతో చేయండి. ప్రశాంతత లభ్యం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

క్రమశిక్షణ అన్నింటా రక్షణ నిస్తుంది. ఉద్యోగాల్లో సమస్యలు రాకుండా ప్రయత్నించాలి. అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడకండి. కుటుంబ సభ్యుల ఐకమత్యం మేలు. ఆధ్యాత్మిక కార్యాలందు ఇష్టులతో కలిసి పూర్తి చేస్తారు. వదంతులు నమ్మకండి. శుభవార్తలు వింటారు. గృహ, భూ వ్యవహార ప్రయత్నాలు మెరుగవుతాయి. విదేశీ చదువులకు అనుకూలమైన సమాచారం సంతోషాన్నిస్తుంది. పురోగతి ఉంది. వాహన ప్రయాణాలందు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికంగా శుభం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

కార్యసిద్ధి. సమయానుకూలంగా మెలగితే పనులు తేలికవుతాయి. విభేదాలు రాకుండా చూసుకోండి. వృత్తి, వ్యాపారాలందు పోటీ అధికమవుతుంది. ఆరోగ్యం తృప్తినిస్తుంది. పెద్దల ఆశీస్సులు, మన్ననలు అందుకుంటారు. స్ర్తిలు అనుకోనివి కూడా చాకచక్యంతో చక్కబెడతారు. కుటుంబ సభ్యులతో కలసి ఉండాలి. వ్యష్టి నిర్ణయాలకంటె సమిష్టి నిర్ణయాలపై దృష్టి పెట్టాలి. అనుకోని శుభాలున్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయ వివాదాలు లేకుండా చూసుకోండి. ఖర్చులు ప్రణాళిక మేరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మేలు. గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది. అనవసర చర్చలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల మార్పులుంటాయి. వాహన సౌఖ్యం. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆహార నియమాలు పాటించడం మంచిది. స్ర్తిలు అనవసర మాటల జోలికి వెళ్లకండి. ఇరుగు పొరుగు వారిని గమనించండి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక శుభాలు కలసి వస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆశయసిద్ధికి అవకాశాలున్నాయి. తెలివితో మెలగితేనే పనులు తేలికగా పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మన్ననలు పొందుతారు. విలువైన వస్తు ప్రాప్తి. పనులందు సంతృప్తిని పొందుతారు. ఆదాయ వ్యయాదులు ఆలోచింపజేస్తాయి. ఇతరుల దైనందిక విషయాల్లో మీ ప్రమేయం తగ్గించుకోండి. మిత్రుల సాయం సమయానికి అందుతుంది. బాధ్యతలు ఎరిగి ప్రవర్తించాలి. సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోండి. నిరుద్యోగులకు, విద్యార్థులకు శ్రమానుకూలంగా ఫలితాలుంటాయి. కంటి, పంటి సమస్యలు రాకుండా చూసుకోండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

కార్యాలు మెరుగైన రీతిలో కొనసాగుతాయి. శ్రద్ధతో పనులు నిర్వహించండి. మొక్కుబడిగా ఏదీ చేయవద్దు. అడ్డంకులున్నా పట్టుదలతో కార్యరంగంలోకి దిగండి. విందు వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మన్ననలు పొందుతారు. విమర్శలకు ప్రతి విమర్శలు రాకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు సత్ఫలితాలు. దంపతులు ఇతరుల మాటలు, ఆక్షేపణలు లెక్కించకండి. స్పెక్యులేషన్ అనుకూలం. ఆచితూచి మాట్లాడండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకోవాలి. మనసెరిగి వయసెరిగి మెలగటం సంతృప్తినిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయండి. వృత్తి, వ్యవసాయ ఫలాలు ఆలోచింపజేస్తాయి. అందరినీ ఒకేలా చూడకండి. దగ్గర వారు దూరమవుతారు. దూరంగా ఉన్నవారు దగ్గరవుతారు. ఈ రోజుకి రేపటికి మార్పును గమనించండి. పెద్దల నిర్ణయాలు మంగళప్రదం. విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు శ్రమానుకూలంగా ఫలితాలుంటాయి. ఉపాధి లభిస్తుంది. ప్రయాణాల్లో వాహన రిపేర్లు రావచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

నిర్ణయాలకు అనుకూలంగా జీవితంలో ఎదుగుదలకు శ్రీకారం చుడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికంగా, పారమార్థికంగా మంచి సమయం. ఖర్చులు, అప్పులందు అప్రమత్తత అవసరం. ముఖ్య సమాచారం అందుతుంది. మంచితనంతో అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాలు వృద్ధి మార్గాన పయనిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులుంటాయి. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. అన్నింటా విజయం మీదే. పర్యవేక్షణ తప్పనిసరి.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855