ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( డిసెంబర్ 18 నుండి 24 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

సాలోచనలతో ముందడుగు వేయండి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సాంకేతిక, ఆర్థిక రంగాల వారు తప్పకుండా అనుకున్నవి సాధిస్తారు. విద్యార్థులు, చిరుద్యోగులకు అనుకోకుండా పైకం అందుతుంది. ఆర్థిక అసమానతలు లేకుండా, ఖర్చులు నియంత్రించుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలాలు అందిస్తుంది. అన్నింటా అప్రమత్తత అవసరం. దంపతులు అనుకోని లాభాలను అందుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

మీదైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలి. మిమ్మల్ని అంతా గమనిస్తారు అన్న భావన కంటె మీ పనులు మీరే చేసుకోవాల్సి ఉంటుందని గ్రహించండి. విలువైన వస్తువులు సంపాదించుకుంటారు. మీ మార్పునకై అనుకున్నవి అనుకున్నట్లే అవుతుంది. మార్గదర్శకత్వంలో నిబద్ధతతో మీరు అనుకున్నవి, చేయాల్సినవి పూర్తిచేసి మన్ననలు అందుకుంటారు. విలువలకై ప్రాధాన్యత ఇవ్వడం మరువకండి. పనులు ఆలస్యమైనా విజయాన్ని పొందుతారు. ఉద్యోగాలకు కొత్త విధానాలు మేలు. కలహాల నివారణ మంచిది. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

దైనందిన జీవితంలో మంచి మార్పులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. ఇబ్బందికరమైన పనులు వాయిదా వేయడం మేలు. పెట్టుబడులు, రాబడికి అనుకూలం. అనుకోని ఘటనలు జరిగేట్లు ఉన్నాయి. బంధుమిత్రుల మాటలు, చేతలు ఆలోచింపజేస్తాయి. ఖర్చులు అంచనాలను మించేటట్లున్నాయి. గౌరవ ప్రతిష్ఠలకు భంగంలేని విధంగా మెలగవలసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తులు, వ్యవహారాలు ఇతరులను ఆలోచించేట్లు చేస్తుంది. మీ ముందున్న వారితో సంయమనం పాటించండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఇరకాటంలోకి జారకుండా పనులు ముందుకు సాగేట్లు వ్యవహరించండి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. సహోద్యోగుల విషయాలలో దూరం పాటించండి. మీ ముందు మంచిగా మాట్లాడినా తరువాత ఇబ్బందికర వాతావరణం ఉండేటట్లుంది. ఆరోగ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు, సాలోచనలు మీకు మెరుగైన జీవితాన్ని అందిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ పోటీ పరీక్షలు ఫలితాలు బాగుంటాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయ, విద్య, సాంకేతిక రంగాల వారికి మేలు. ఏ పనైనా ఆలోచించి ముందుకు వెళ్లండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

జయం మీదే అన్నట్లు అన్నింటా తొందరపాటు చర్యలు వద్దు. కొత్త పరిచయాల వల్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార, వృత్తులందు అనుకూల వాతావరణం నెలకొంటుంది. చైతన్యంతో బాధ్యతాయుతంగా మెలగండి. ఆత్మవిశ్వాసం మీకు మేలు కలుగజేస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తత మంచిది. వ్యాపార విస్తరణకు మంచి తరుణం. రియల్ ఎస్టేట్ రంగం వారు అనుకోని లాభాలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఖర్చులు ఆలోచింపజేస్తాయి. మిత్రులు చేసే పనులను కూడా గమనిస్తూ ముందుకు వెళ్లండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

నమ్మకంతో పనులు పూర్తి చేయండి. ఇబ్బందులు ఉన్నా మీదైన ముందుచూపుతో ముందుకు వెళతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ భాగస్వామ్య, వ్యాపార విస్తరణ ఉంటుంది. ఆత్మీయుల సూచనలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు మార్పునకు దారితీస్తాయి. అధికారులు, పెద్దలు సహకారం అందిస్తారు. స్పెక్యులేషన్ ఫలవంతం. స్ర్తి, పురుషులు ఆలోచనతో కార్యాలు పూర్తి చేస్తారు. డబ్బులకై ఇబ్బందులు పడకండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

మిత్రులు, బంధువుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. లోగడ పెండింగ్‌లో ఉన్న కార్యాలను సైతం ముగిస్తారు. మీ శక్తిసామర్థ్యాలు మీ పక్కవారు గుర్తిస్తారు. మీరు చేసే పనులు శుభమార్గాన పడటం వలన అంతా మంచే అవుతుంది. స్ర్తిలు విలువైన వలువలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. రావలసిన పైకం సమయానికి అందుతుంది. పైకం ఇబ్బందులు సర్దుకుంటాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. స్పెక్యులేషన్ లాభదాయకం. ఒక మంచి ఘటన మీ కుటుంబానికి, మీకు ఆనందాన్నిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అందరినీ కలుపుకొని వెళితేనే బాగుంటుంది. ఆరోగ్యం యోగవంతంగా ఉంటుంది. నియమపాలన ఆర్థిక వెసులుబాటుకు మంచిది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్, ఆక్వా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల వారు మెరుగైన ఫలితాలు పొందుతారు. మీదైన పద్ధతులతో ముందుకు వెళ్లడం మంచిది. సంతోషకరమైన వాతావరణంలో స్ర్తి పురుషులు మెరుగైన కార్యాలు చేస్తారు. నూతన పరిచయాలు మెరుగవుతాయి. పరిమిత ప్రయోజనాలు అందుకుంటారు. మిత్రుల సాయం లభ్యం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

కస్సుబుస్సుమనే పద్ధతిలో కాకండా ఆలోచనతో కార్యాలు పూర్తి చేయండి. వ్యాపార, ఉద్యోగ, వృత్తి, చేనేత రంగాల వారు అన్నింటా లాభాలు అందుకుంటారు. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. ఉద్యోగాలందు అదనపు బాధ్యతలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానాభివృద్ధికి అవకాశం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ప్రైవేట్ రంగాల వారికి స్థిరీకరణకు అవకాశముంది. అనుకోని శుభ సంఘటనలు మీ మార్గాన్ని సుగమం చేస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. హితుల సాయంతో అన్నిటా మంచే జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలసి వస్తాయి. కుటుంబ సభ్యులు మంచి ప్రవర్తనను చవి చూస్తారు. ఉత్సాహాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పని చేయడం మంచిది. మంచి గుర్తింపును అందుకుంటారు. దంపతులు అనుకోని విధంగా లబ్ధిని పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, న్యాయ, ఆర్థిక రంగాల వారు మెరుగైన ఫలాలను అందుకుంటారు.

కుంభం ( 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

అన్నింటా అదృష్టం మీదే. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పొందుతారు. ఆందోళనతో పనులు ఏవీ పూర్తి చేయవద్దు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, కమర్షియల్, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాలు ఊపందుకుంటాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తయి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలలో అప్రమత్తత అవసరం. ఖర్చులు ఆలోచింపజేస్తాయి. మిత్రులు చేసే పనులను కూడా గమనిస్తూ ముందుకు వెళ్లండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

తలచిన కార్యాలు పూర్తవుతాయి. ప్రతి ఆలోచన విజయాన్నిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలాలు ఉంటాయి. అభివృద్ధే ధ్యేయంగా పనులు కొనసాగిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, న్యాయ రంగాల వారు అనుకున్నవి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. మీకు అడ్డు తగిలేవారు ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి. యత్నాలు, ప్రయత్నాలు అసంకల్పితాలు. ఇతరులు మీ అవసరాన్నిబట్టి సమయానికి అందుకుంటారు. అన్నింటా జయం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855