ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? జనవరి 8 నుండి 14 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

సమయానుకూలంగా వ్యవహరించండి. అదృష్టం తలుపు తట్టిందా అన్నట్లుంది. ధైర్య, మానసిక బలంతో ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు. మొహమాటాలే వద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. వృత్తి వికాసానికి మార్గాలు మెరుగవుతాయి. ఉద్యోగులకు పైవారి ఆశీస్సులు ఉంటాయి. వ్యాపారాలలో ఒత్తిడికి గురి కావచ్చు. ప్రయాణాలు అవసరాన్నిబట్టి చేయండి. హితులు మీకు అండగా నిలుస్తారు. స్పెక్యులేషన్ అనుకూలం. ఆర్థిక విస్తరణకు అవకాశం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు. విజయానికి అనుకూల వాతావరణం. ఒత్తిడికి గురికావద్దు. మంచి మాటలతో పనులు త్వరగా పూర్తి చేసుకోండి. అన్నింటా బాధ్యతలు పెరుగుతాయి. అపనిందలను లెక్కచేయకుండా మీ మార్గాన ముందుకు వెళ్లండి. వదంతులను నమ్మవద్దు. ఉద్యోగ, వ్యాపార, వృత్తుల వారికి తృప్తి. స్పెక్యులేషన్ మిశ్రమం. ఒక విషయంలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. అపార్థాలకు తావివ్వకండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

వెంటవెంట పనులు కావటంతో ఉత్సాహంగా ఉంటారు. పట్టుదల, ఓపికతో అవసరాలను పూర్తి చేసుకుంటారు. వృత్తి, ప్రవృత్తికి అనుగుణంగా ఉండకున్నా, సంయమనంతో ముందుకు సాగండి. స్ర్తిలు అనుకున్నవి సాధించుకొంటారు. ఆశించిన ఫలాలను అందుకుంటారు. ఇంటా బయటా సమస్యలున్నా మీ బుద్ధిబలంతో పరిష్కరించుకుంటారు. విందు వినోదాల్లో హితులతో కలిసి ఆనందిస్తారు. పెట్టుబడులకు మార్గాలు గోచరిస్తాయి. సంఘ, రాజకీయ కార్యాల్లో చురుగ్గా పాల్గొని, గుర్తింపును పొందుతారు. ఓ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

మంచి అవకాశాలను సావకాశంగా వినియోగించుకుంటారు. సమర్థవంతంగా అనుకున్నది సాధిస్తారు. మీరు ఎదురుచూస్తున్న వారు రాకపోవచ్చు. మంచి ఫలితాలుంటాయి. నిబద్ధతతో పనులు పూర్తి చేస్తారు. నిరాశను దరికి రానీయకండి. వాగ్వివాదాలతో కాలయాపన చేయవద్దు. ఆత్మీయుల సలహాలు ప్రయోజనకారిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఉపాథి, పోటీ పరీక్షలు, విద్యారంగాలు కొత్త కోణాలు చూస్తాయి. బంధుమిత్రులతో మాటలు పరిధులు దాటకుండా చూసుకోవాలి. దంపతులు ఒకే మాటపై ఉండండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

మంచి ఫలితాలుంటాయి. పట్టుదల, ఓర్పుతో వ్యవహరించండి. అవకాశాలు మెండు. అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పైకం అందుతుంది. ఖర్చులు నియంత్రించుకోండి. స్ర్తిలు కావలసినవి పొందుతారు. ఆటంకాలున్నా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాల వారు పోటీని తట్టుకోవాల్సి వస్తుంది. ఆహార, విహార నియమాదులు పాటించండి. స్పెక్యులేషన్ వాయిదా మంచిది. కుటుంబ సభ్యులకు కొంత సమయాన్ని కేటాయించండి. విలువైన వస్తువులతో కొంత ప్రమాదకరం. పరిచయాలు మెరుగవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

పెద్దల, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. పనులు నత్తనడకన వున్నా బుద్ధిబలంతో పూర్తి చేస్తారు. దూరపు బంధువులు వస్తారు. మీకు మంచి సూచనలిస్తారు. ఆదాయ వ్యయాదులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. కుటుంబ సభ్యుల ఆనందంలో పాలుపంచుకుంటారు. డబ్బు దగ్గర మొహమాటం వద్దు. మీ వారిని కలుపుకొని పనులు చేయడంవల్ల గుర్తింపు మీకు వర్తిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకం. స్పెక్యులేషన్ మిశ్రమం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిదానమే ప్రధానం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

మీరు అనుకున్న పనులు కొనసాగుతాయి. పరిచయాలు బలపడుతాయి. విలాసాలకు ఖర్చు పెడతారు. ఖర్చులను నియంత్రించటం మంచిది. ఆదాయం సరిపడా ఉంటుంది. తగాదా విషయాలకు దూరంగా ఉండండి. పనుల సానుకూలతకై ప్రయత్నాలు ముమ్మరం చేయండి. కుటుంబ సభ్యులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక విషయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మెరుగవుతాయి. గతం కంటె కష్టనష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకండి. మంచి కాలం ముందుంది. స్పెక్యులేషన్ ఫరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

బంధుమిత్రుల రాకపోకలుంటాయి. సునాయాసంగా, మీ నేర్పుతో పనులు పూర్తి చేస్తారు. కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆదాయం ఆనందాన్ని కలిగిస్తుంది. అదనపు ఆదాయానికి మార్గాలు గోచరిస్తాయి. నూతన వస్తువులు లభిస్తాయి. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. భూలాభం ఉంటుంది. మీరు అనుకున్నవి దగ్గరలోనే పూర్తవుతాయి. భవిష్యత్తు ఆనందంగా ఉండటానికై ప్రణాళికలు వేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, చిరుద్యోగ, విద్యా విషయాలు తృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, పదవులు, గౌరవాలు దక్కుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

కోపతాపాలకు వెళ్లకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారుంటారు. జాగ్రత్త. ఆత్మబలంతో పనులు ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, లలిత కళల రంగాల వారు లక్ష్య సాధనకు చేరువవుతారు. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. పనులు కొన్ని అన్యమనస్కంగా చేయవలసి వస్తుంది. తొందరపడి హామీలు ఇవ్వకండి. మిత్రులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికంగా ఫలితాన్నిస్తాయి. ఓర్పు, నేర్పు అన్నింటా మేలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

మీరు అనుకున్నవి చేస్తారు. కార్యసాధన ఉంది. శుభవార్తలు వింటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పనులు సకాలంలోనే చేయగలుగుతారు. మిత్రులు, హితులకు మీ సహాయం అవసరపడుతుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తుల వారు అనుకోని విధంగా మెలగవలసి వస్తుంది. ఎదురైన వారిని కనిపెట్టండి. పరిచయం లేనివారు మంచిగా ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తారు. అవసరాలు మారుతాయి. ఖర్చు విధానాలు ఆలోచింపజేస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

పట్టుదలతో, మెళకువలతో కార్యాల్ని సాధిస్తారు. పెద్దల ఆశీస్సులుంటాయి. చేపట్టిన రంగాల్లో వృద్ధిని కాంక్షిస్తారు. మీకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. విలువైన వస్త్ర, వస్తువులు ఖరీదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సకాలంలో ఆశించినవి అందుకుంటారు. మిత్రులు మీకు చేదోడువాదోడుగా ఉంటారు. బాధ్యతాయుతంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ, భాగస్వామ్య వ్యవహారాలు గతంలో వలె ఉంటాయి. దంపతులు వదంతుల వ్యాప్తికి దూరంగా ఉండండి. మీ పనులందు ఏకాగ్రత చూపండి. స్పెక్యులేషన్ మిశ్రమం. జయప్రదం. దగ్గర వారితో సంతోషాన్ని పంచుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చినా పనులు వాయిదా శ్రేయస్కరం కాదు. అనుకున్నవి అందుకుంటారు. లక్ష్యసాధనకు పథకాలు వేస్తారు. అవసరాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేవారిని ఒక కంట గమనించండి. సాంకేతిక రంగం మీకు ఉపకరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆలోచింపజేస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. స్ర్తిలు విలువైనవి సమీకరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వృత్తి, ఉద్యోగ రంగాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు మంచి తరుణం.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855