'క్లాప్' కొట్టు గురూ!

బాలీవుడ్‌పై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో యువతరం హీరోలనుంచి అగ్ర హీరోల వరకు ఆడిపాడిన అందాల భామ మిల్క్‌బ్యూటీ తమన్నా బాలీవుడ్‌పై మోజును పెంచుకుంటోంది. ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు విజయవంతంగా నటిగా తన 11ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. చేసిన చిత్రాలు.. పోషించిన పాత్రలు ఆమెకు ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. అయితే ఏ హీరోయిన్‌కైనా టార్గెట్ బాలీవుడ్డే అన్నది అందరికీ తెలిసిందే. తమకు నచ్చిన భాషల్లో చిత్రాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఇక ఎవరికైనా బాలీవుడ్‌పైనే మోజు కలగడం ఖాయం. అందుకు తమన్నా మినహాయింపేమీకాదు. ఈ విషయం గురించి తమన్నాను కదిలిస్తే- ‘‘ ఫెయిర్ అండ్ లవ్‌లీ వంటి కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించాక వెండితెరపై నటించే అవకాశాలొచ్చాయి. ఇక ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యా. ప్రస్తుతం నా కెరీర్ ఎంతో సంతృప్తికరంగా వుంది. ఇకపై మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆయా చిత్రాల్లోని నా పాత్రల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. ఎప్పటికైనా బాలీవుడ్‌లో తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నా’’అంటూ చెప్పుకొచ్చింది మిల్క్‌బ్యూటీ. అదీ..విషయం! అన్నంత పనే చేస్తుందిగా..!!