'క్లాప్' కొట్టు గురూ!

గ్లామర్ క్వీన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కత్రీనాకైఫ్ చేస్తున్న చిత్రాల్లో తనవి అన్నీ గ్లామర్ పాత్రలే. చేస్తున్న చిత్రాలు..పోషిస్తున్న పాత్రలు అన్నీ బిగ్ బ్యానర్లలోనే. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండటం ఈ భామకు బాగా తెలుసు. ఇక రూమర్స్‌గోల అయితే లెక్కేలేదు. ఈ బ్యూటీపై వచ్చినన్ని రూమర్స్ మరే తారపై రాలేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అని కత్రీనాను అడిగితే- ‘‘ఎదుగుతున్న తారలపై.. ఎదిగిన తారలపై ఇలాంటి రూమర్స్ రావడం మామూలే. రూమర్స్ వస్తేనే ఆ నటి బాగా పాపులర్ అయిట్టు. ఇక నా విషయం అంటారా.. నేను వీటిని అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అలా పట్టించుకుంటే మన కెరీర్ ఇక అంతే సంగతులు. అందుకే వాటి జోలికి వెళ్లనుగాక వెళ్లను. నాపై లేనిపోనివి ఎన్ని సృష్టించినా పట్టించుకోను’’అంటూ తెగేసి మరీ చెప్పింది. దటీజ్..కత్రీనాకైఫ్!!