అక్షరాలోచన

ఎవరి ప్రపంచం వారిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యచంద్రుల
పదవీ విరమణ
పదవీ స్వీకారం
నిత్యకల్యాణం పచ్చతోరణమైనా
అత్యంత నిశ్శబ్దంగా
నిరాడంబరంగా ముగుస్తుంది!
రాజరికం రాజ్యమేలుతున్న
అబుదాభి రాజ్యంలో
ఎమిరేట్స్ భవంతికి ఎదురుగా నిల్చున్నాను
చంద్రుడూ యాత్రికుడై వచ్చి
పండువెనె్నల నజరానా సమర్పించాడు
నక్షత్రాల సైన్యం అతడి చుట్టూ
రక్షణగా నిలిచివుంది
ఎమిరేట్స్ నిర్మాణానికి
శ్రమించిన విశ్వకర్మల
శిల్పకళా నైపుణ్యానికి
వారిని స్మరిస్తున్నాను!
అందాన్ని వీక్షిస్తూ నిబిడాశ్చర్యంలో
మునిగిన చూపు
నా శరీరాన్ని మరచింది
అజాగ్రత్తగా మోపిన పాదం
పై మెట్టుపై పట్టు తప్పింది
జి-సెవన్ దేశాల ఏకగ్రీవ నిర్ణయంలా
ఏడు మెట్లు ఐక్యమై శరీరాన్ని దొర్లించాయ
శరణాగత రక్షకుడు శిబి చక్రవర్తిలా
ఎనిమిదో మెట్టు ఆదుకుంది
నోటికి ఏమైందో మాట పెగల్లేదు
మనసుకు ఏమైందో మైకం కమ్ముకుంది
చేతులకు ఏమైందో నిస్సత్తువ ఆవరించింది
చుట్టుముట్టిన యాత్రికులు
నన్ను చిత్రీకరిస్తున్నారు
గురిపెట్టిన కెమెరాలు
వివిధ భంగిమల్లో నిల్చున్నాయ
ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు
చేయూతనిచ్చిన జాడ లేదు
సర్దుకున్న శరీరం నన్ను నేనుగా నిలబెట్టింది
రాయబారం నాటకం గుర్తొచ్చింది
ఒక్కండు నీ మొర ఆలకింపడు
రారాజుకు శ్రీకృష్ణుని సందేశం
మదిలో మెదలాడింది!
మనిషి మనిషిగా ప్రపంచం విడిపోయంది
మనిషికో ప్రపంచం నిర్మించబడింది
మనిషి బాధ మనిషికి ఆహ్లాదమైంది!

- అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946