అవీ .. ఇవీ..

జీవకళ ( అవీ..ఇవీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రంలో కన్పిస్తున్నది అచ్చమైన ఆడపిల్లలు అనుకుంటున్నారు కదూ...ఆ కళ్లల్లో జీవం చూస్తే ముచ్చటేస్తుంది కదూ..కానీ అవి కేవలం బొమ్మలు. రష్యా కళాకారుడు మైఖేల్ జజ్‌కోవ్ వీటిని తయారు చేశాడు. అందంగా ముస్తాబు చేసిన ఇలాంటి బొమ్మల్లో అందర్నీ ఆకట్టుకున్నవి మూడు. ఆ బొమ్మల అమ్మాయిలకు ఉల్యాన, నటాలియ, సోఫియా అని పేరుపెట్టాడు. సోషల్‌మీడియాలో ఈ ఫోటోలు పోస్ట్ చేయడమే తరువాయి అభినందనల వెల్లువ మొదలైంది. జజ్‌కోవ్‌కు ఇప్పుడు 71వేలమంది ఫాలోవర్లు ఉన్నారంటే ఈ బొమ్మలచలవే.

ఎగిరిపోతే ఎంత బాగుంటుందో...
ఈ రెండు గోరింకలు అదే పాట పాడుకుంటూ రివ్వుమని దూసుకుపోతున్నట్టున్నాయి. ఒకదానిపై ఒకటి కూర్చుని ఎగురుతున్నట్లనిపించినా నిజానికి అవి పక్కపక్కనే ఎగురుతున్నాయి. దిల్లీలోని ఓ అపార్టుమెంటులో గూళ్లలో ఉండే ఈ జంట ఇలా బైటకు ఎగిరినప్పుడు అక్కడే ఉన్న ఐటి కన్సల్టెంట్ నితిన్‌చంద్ర తన కెమెరాను క్లిక్‌మన్పించారు.

గాజుకొండలు

దట్టంగా, ఆకుపచ్చగా కళకళలాడుతున్న ఈ కొండలు నిజంగా చెట్టూచేమలతో నిండిపోలేదు. ఇక్కడ కన్పిస్తున్నవి నిజమైన కొండలూ కాదు. ఇజ్రాయల్‌లోని ఓ గాజుపెంకుల రీసైక్లింగ్ కంపెనీ ఆవరణలో గుట్టలుగుట్టలుగా పోసిన పగిలిన గాజుముక్కల సమూహం ఇది. ఆకుపచ్చ, ముదురు జేగురురంగు గాజుసీసాల ముక్కలన్నీ ఇలా గుట్టలుగా పోశారు. ఒక్కో గుట్ట 50 అడుగుల ఎత్తు, కొన్ని ఫుట్‌బాల్ మైదానాల సైజులో ఉండటంతో ఇలా పర్వతప్రాంతంలా కన్పిస్తోందంతే.

చినచేపను పెదచేప..

మత్స్యన్యాయం అంటే ఇదేనేమో...ఈ చిత్రంలో కన్పిస్తున్న దృశ్యం దానినే చెబుతోంది. సియోల్ నగరంలోని ఓ అక్వేరియంలో సాండ్ టైగర్ షార్క్ కలియతిరుగుతూ ఎదురుపడిన మరో చిన్న షార్క్‌ను గుటుక్కున మింగేసింది. షార్క్‌లు చేపలను తినడం సాధారణమే అయినా ఇంత ప్రత్యక్షంగా చూడడం గొప్పే.

-భరతి