అక్షరాలోచన

మా అమ్మె నా కొడుకై పుట్టింది ( అక్షరాలోచనాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమను
ఆకులా తన వీపుల మీదకు ఎక్కించుకుని నన్ను
వొడ్డుకు చేర్చి రక్షకుడయ్యాడు.

సమూహంలో ప్రమాద గాయాలతో
మూల్గుతున్న నన్ను హత్తుకొని, ఆదరించిన
మంచి సమరేయుడు

ఆకాశం అమ్మయి నన్ను వోదార్చి
నడి వయస్సులో నా బాల్యం గుర్తుకు
తెచ్చిన అమ్మవాడు

అమ్మ అనేక రూపాలు
ఇంకా రుణపడే ఉన్నానన్నట్లు
మిగిలిపోయిన సేవను కొనసాగించడం కోసం
నా తల్లి నా గర్భ ఫలమయ్యింది
కొడుకై జన్మించింది.

కావిడితో కన్న వారిని ప్రపంచమంతా మోసిన
శ్రావణకుమార్ వాడు
వేటగాడి విల్లంబునకు
గాయపడ్డ హంసను
సేదదీర్చిన సిద్దార్థు వాడు
బోధివృక్షానికి జ్ఞాన జలం అందించి
బ్రతికించగల జ్ఞానివాడు.

వృద్ధాశ్రమాలని చూసి బోరున విలపించేవాడు
ప్రపంచ వృద్ధులకు కొడుకైతే
ఎంత బాగుండేది
మా అమ్మ నా కొడుకై పుట్టింది!!

నేను ప్రేమిస్తున్నాను

-బి.రాంకుమార్
8143669129

నేను ప్రేమిస్తున్నాను
అని నెత్తీ నోరు మొత్తుకొని
చెవుల్లో జోరీగలా
పరిభ్రమిస్తూ చెపుతున్నా
అప్రయత్నంగా
విననట్టు నటిస్తూ
నీకుగా నువ్వే
నీ ఇచ్చగా వ్యవహరిస్తున్నావు
ప్రపంచ సుందరివన్న
టెక్కు నీకెందుకు?
నీ ప్రేమ పొందడం కోసం
నేను ఎలాంటి నమ్మకం కలిగించాలి
ఎవరెస్టు శిఖరం ఎక్కి చూయించనా
యమధర్మరాజుని భూలోకం రప్పించనా
నీ కళ్లలో ఏ మత్తు ఉందో
హరిహరులకైనా గుర్తించడం
అసాధ్యమే సుమా!
*

జీవన పయనం

-నాశబోయిన నరసింహ
954223 6764
పట్టపగలూ - నడిరేరుూ
ఎప్పుడైతేనేం
దారికి దాహార్తి తీరదు
తండ్రీ తనయుల
అన్నా చిన్నల
అనుబంధాలు తెగిపోతున్నాయ్

జ్ఞాపకాల వేకువ రేఖలు
మసకబారుతున్నాయ్
అరక్షణం ఆదమరిస్తే
ఆనందం అవిటితనమే
అనే్వషించిన కొద్దీ
పొరపాట్లు వెంటాడుతుంటాయ్

నిర్వేదంగా - నిర్లిప్తంగా
మూగ శవాల అశ్రు నివాళి సాక్షిగా
హై స్పీడు ముఖం చాటేస్తోంది
రక్తపు డాంబర్‌తో
ఎరుపెక్కిన రహదారిని చూసి
అనాధ గొంతుకలు
ఆకాశ హర్మ్యాల్ని తాకిన వైనం
పక్క వాహనం దాటి మీసాలు మెలేసి
గమ్యాన్ని స్వల్ప కాలంలో చేరాలనే తపన

క్రాసింగ్‌లు - కార్నర్‌లు
సింగిల్ వే సిగ్నల్ పాయింట్లు
జీబ్రా గీతల జిగిబిగిలో
గ‘మ్మత్తు’గా స్టీరింగ్ విన్యాసానికి సైకొట్టే
వాహన చోదకులారా!
జీవన పయనం జర భద్రం!

-దుగ్గినపల్లి ఎజ్రాశాస్ర్తీ 80962 25974